Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలవాల్సిన మ్యాచ్.. రోహిత్‌ క్యాచ్‌ చేజార్చడంతో కోల్పోయాం

ICC Cricket World Cup 2019, Bangladesh vs India: Drop Rohit Sharma and he will make you pay says Mashrafe Mortaza

టీమిండియా ఓపెనర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ చేజార్చడం.. లక్ష్య ఛేదనలో భారీ భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడంతో మ్యాచ్ కోల్పోయాం అని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా అభిప్రాయపడ్డాడు. మంగళవారం బర్మింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో టీమిండియా వరుసగా మూడోసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 గెలవాల్సిన మ్యాచ్:

గెలవాల్సిన మ్యాచ్:

మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ... 'మేము గెలవాల్సిన మ్యాచ్ కానీ.. ఛేదించలేకపోయాం. మరో మంచి భాగస్వామ్యం (80-90 పరుగులు) నమోదైతే విజయం సాధించే వాళ్ళం. అదృష్టం కలిసిరాలేదు. ముస్తాఫిజుర్‌ మంచి ప్రదర్శన చేసాడు. టోర్నీ ప్రయాణం బాగుంది. షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫిక్‌ రహీమ్‌ అద్భుతంగా ఆడారు. వారి అసాధారణమైన ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా' అని మొర్తజా తెలిపారు.

తమీమ్‌ను నిందించలేం:

తమీమ్‌ను నిందించలేం:

'రోహిత్‌ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి బ్యాట్స్‌మన్‌ క్యాచ్‌ చేజార్చడం నిరాశను మిగిల్చింది. కానీ మైదానంలో ఇవి సాధారణమే. తమీమ్‌ను నిదించలేం. మా తదుపరి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో. ఆ మ్యాచులో కూడా విజయం సాదించేందుకు పోరాడుతాం. అభిమానుల మద్దుతు అద్భుతం' అని మొర్తజా చెప్పుకొచ్చారు.

క్యాచ్ మిస్:

క్యాచ్ మిస్:

టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా రోహిత్ భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న తమీమ్‌ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో బంతి అతడి చేతుల్లో నుంచి చేజారింది. అనంతరం రోహిత్ చెలరేగి 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని చేశాడు.

సెమీఫైనల్లోకి టీమిండియా:

సెమీఫైనల్లోకి టీమిండియా:

ఈ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

Story first published: Wednesday, July 3, 2019, 13:21 [IST]
Other articles published on Jul 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+