Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా.. స్కోర్ 97/2

ICC Cricket World Cup 2019, Bangladesh vs Afghanistan: Nabi removes Tamim, Bangladesh lose two, Earlier, Mujeeb had dismissed Liton

ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు లిటన్‌ దాస్‌, తమీమ్‌ ఇక్బాల్‌లు ఆరంభించారు. లిటన్‌ దాస్‌ ధాటిగా ఆడాడు. మరోవైపు తమీమ్‌ ఇక్బాల్‌ మాత్రం ఆచితూచి ఆడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. ముజీబ్ బౌలింగ్‌లో లీటన్ దాస్ పెవిలియన్ పెవిలియన్ చేరాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర షాహిదికి క్యాచ్ ఇచ్చాడు. తొలుత అంపైర్‌ ఔట్‌ ఇచ్చినా.. బంతి కింద పడినట్లు అనుమానం ఉండటంతో థర్డ్‌ అంపైర్‌కు నివేదించడంతో రిప్లేలో ఔట్‌గా తేలింది. ఈ సమయంలో తమీమ్‌ ఇక్బాల్‌కు షకీబ్‌ జత కలిసాడు. ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

17 ఓవర్ చివరి బంతికి నబీ.. తమీమ్‌ ఇక్బాల్‌ (36; 53 బంతుల్లో 4×4)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. దీంతో బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం షకిబ్‌కు రహీమ్‌ జత కలిసాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం షకిబ్‌ (33), రహీమ్‌ (6)లు క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లకు బంగ్లా రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే బంగ్లాకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగ్లా-అఫ్గాన్‌ పోరు ఆసక్తికరంగా మారింది.

1
43674
Story first published: Monday, June 24, 2019, 16:47 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+