
పటిష్టంగా బంగ్లా:
వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌లో బంగ్లా 322 పరుగుల లక్ష్యాన్ని 41 ఓవర్లలో ఛేదించి బ్యాటింగ్‌లో సత్తా చాటుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 వికెట్లు కోల్పోయి 333 పరుగులు సాధించి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. షకీబుల్ హసన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తమీమ్‌లు ఫామ్ అందుకోవడం బంగ్లా జట్టుకు సానుకూలాంశం. రహీం, షబ్బీర్, మహ్మదుల్లాలు బ్యాట్ జులిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ముస్తాఫిజుర్, మోర్తజా, షకీబ్, సైఫుద్దీన్, హాసన్ ఉన్నారు. బంగ్లాకు విజయం సాధించడం సులువే.

ఆత్మవిశ్వాసంతో అఫ్గాన్:
ఇప్పటివరకు బోణీ కొట్టని అఫ్గానిస్తాన్.. అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప బంగ్లాపై విజయం సాధించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ అఫ్గాన్ విఫలమవడం జట్టుపై ప్రభావం చూపుతోంది. అయితే అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కానీ ఈ మ్యాచ్ ద్వారా అఫ్గాన్ ఆటగాళ్లలో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. నబీ ఆకట్టుకున్నాడు. టోర్నీలో నజీబుల్లా, హష్మతుల్లా, నబీ ఒక్కో అర్ధ సెంచరీ చేయడం మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక బౌలింగ్‌లో నబీ, రషీద్ ఖాన్, గుల్బదిన్, హమీద్ హసన్ కూడా రాణించలేదు. ఈ నేపథ్యంలో అందరూ రాణిస్తేనే విజయంపై ఆశలు ఉంటాయి.

Teams (Possible XI)
Bangladesh: Soumya Sarkar, Tamim Iqbal, Shakib Al Hasan, Mushfiqur Rahim, Liton Das, Mahmadullah, Mosaddek Hossain, Mehidy Hasan, Rubel Hossain/Mohammad Saifuddin, Mushrafe Mortaza, Mustafizur Rahman.
Afghanistan: Hazratullah Zazai, Gulbadin Naib, Rahmat Shah, Hashmatullah Shahidi, Asghar Afghan, Mohammad Nabi, Najibullah Zadran, Rashid Khan, Ikram Alikhil, Aftab Alam, Mujeeb Ur Rahman.


Click it and Unblock the Notifications












