ప్రపంచకప్.. బంగ్లాతో మ్యాచ్ అనంతరం స్వదేశానికి మలింగ

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు మలింగ అత్త కాంతీ పెరీరా తుది శ్వాస విడిచారు. ఈ మరణవార్త బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్న మలింగకు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం మలింగ స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మలింగ అత్త కాంతీ పెరీరా అంత్యక్రియలను గురువారం కొలంబోలో నిర్వహించనున్నారు. జూన్ 15న (శనివారం) ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు మలింగ జట్టుతో కలిసే అవకాశం ఉందని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు.
టాస్ వేసే సమయానికి మైదానంలో వర్షం పడింది. దీంతో అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. అయితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున.. సుమారు గంట తర్వాత పిచ్ పరిస్థితి సమీక్షించి టాస్ వేసే అవకాశం ఉంది. ఒకవేళ మళ్లీ భారీ వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. లంకకు వరణుడు అడ్డుపడడం రెండోసారి అవనుంది.
ఇప్పటివరకు లంక, బంగ్లాలు 43 వన్డేలు ఆడాయి. వీటిలో 36 లంక గెలిస్తే.. 7 బంగ్లా నెగ్గింది. ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో లంకే గెలిచింది. రికార్డులు లంకకు అనుకూలంగా ఉన్నా.. లంక పరిస్థితి ఇపుడు ఏమంత బాగాలేదు. లంక బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తడబడుతుండడంతో.. బంగ్లాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications