ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ ఢీ.. విజయం ఎవరిదీ?

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తుగా ఓడించగా.. పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై గెలిచి ఆసీస్ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. పటిష్ట బ్యాటింగ్, బౌలింగ్ ఉన్న ఇరు జట్ల మధ్య ఈ రోజు ఆసక్తికర పోరు జరగనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫామ్‌లో ఓపెనర్లు:
ఏడాది నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్ తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఉస్మాన్ ఖవాజ, స్టీవ్ స్మిత్ పర్వాలేదనిపించారు. వీరితో ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక మ్యాక్స్‌వెల్, క్యారీ, స్టోయినిస్‌తో కంగారూల మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. ఆసీస్ పేస్, స్పిన్ విభాగాల్లో మెరుగ్గా ఉంది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌కు తోడుగా నాథన్ కౌల్టర్‌నైల్, ఆడమ్ జంపాలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. కమ్మిన్స్ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు కూడా తీసాడు. ఆసీస్ పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం విండీస్ జట్టుకు సవాలే.

గేల్, రసెల్‌లపైనే:
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 33 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లతో ఓపెనర్ క్రిస్ గేల్ మెరుపు అర్ధ శతకం చేసాడు. మరో ఓపెనర్ హోప్, డారీన్ బ్రావో గాడిలో పడాల్సి ఉంది. నికోలస్ పూరన్, హెట్మయర్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. చివరలో హోల్డర్, రసెల్‌లు విరుచుకపడనున్నారు. అయితే గేల్ విజృంభణతో స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన విండీస్ బ్యాట్స్‌మన్‌కు ఆసీస్‌తో మ్యాచ్‌లో అసలైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాకు సవాలే:
విండీస్ బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగానే ఉంది. ఓషానే థామస్, కార్టెల్, కెప్టెన్ హోల్డర్, ఆండ్రీ రసెల్‌లతో పేస్ బౌలింగ్ బాగుంది. కీమర్ రోచ్ కూడా వస్తే.. మరింత పటిష్టంగా మారుతుంది. అయితే విండీస్ ఆ జట్టులో సరైన స్పిన్నర్ లేకపోవడం లోటే. నర్స్ ఒక్కడే స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. విండీస్ పేస్ విభాగంను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు కష్టమే. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఆసీస్, వెస్టిండీస్ జట్లు ఎలా ఆడుతాయో చూడాలి.

ఆస్ట్రేలియా:
ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఖవాజ, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్యారీ, కౌల్టర్‌నైల్, కమ్మిన్స్, స్టార్క్, జంపా.

వెస్టిండీస్:
గేల్, హోప్, బ్రేవో, పూరన్, హెట్మయర్, రసెల్, హోల్డర్, బ్రాత్వైట్, నర్స్, థామస్, కార్టెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications