న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్‌ ఎమోషనల్ మెసేజ్.. ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా (వీడియో)

ICC Cricket World Cup 2019 : Dhawan Out Of World Cup,Pant To Replace The Left-Hander || Oneindia
ICC Cricket World Cup 2019, Australia vs India: India Openar Shikhar Dhawan says in emotional message after being ruled out of World Cup

చేతివేలి గాయం ఇంకా తగ్గలేదు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా అంటూ టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ఎమోషనల్ అయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ సంద‌ర్భంగా శిఖ‌ర్ ధావ‌న్ గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ పాట్ క‌మ్మిన్స్ వేసిన ఓ బౌన్స‌ర్‌ ధావ‌న్ వేలికి బలంగా తాకింది. దీంతో ధావన్ వేలు స్వ‌ల్పంగా చిట్లి పోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గాయంలో ఎలాంటి మార్పూ లేదు:

మొదటగా ధావన్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే త‌గ్గుతుంద‌ని జట్టు యాజమాన్యం ఆశించారు. గాయం కారణంగా మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు అతనికి ఫిజియోథెరపీ నిర్వ‌హించారు. అయిన‌ప్పటికీ.. గాయంలో ఎలాంటి మార్పూ రాలేదు. వేలికి మ‌రింత వాపు వచ్చింది. దీంతో టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది.

మ్యాచ్‌లు ఆడే ప‌రిస్థితుల్లో లేడు:

'శిఖ‌ర్ ధావ‌న్ ఎడమ బొటన వేలి ఎముక విరిగింది. ప్రస్తుతం అతడు మ్యాచ్‌లు ఆడే ప‌రిస్థితుల్లో లేడు. తాజా అతడి పరిస్థితిని అంచనా వేయగా.. జూలై రెండో వారం వరకు కోలుకొనే అవకాశం కనిపించడం లేదు. దాంతో ధావన్ పంచ‌క‌ప్‌లోని అన్ని మ్యాచ్‌ల‌ నుంచి వైదొలగాల్సివస్తోంది' అని భారత జట్టు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యం బుధవారం వెల్లడించాడు. 'శిఖర్‌కు బదులు జట్టులోకి పంత్‌ను అనుమతించాలని ఐసీసీని కోరాం' అని కూడా తెలిపాడు. ఈ విష‌యాన్ని సుబ్రహ్మణ్యం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు.

 ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా:

ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా:

బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్‌ ఎమోషనల్‌​ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. 'బొటనవేలు గాయం ఇంకా తగ్గలేదు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా. ఏదేమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన నా జట్టు సబ్యులకు, క్రికెట్ అభిమానులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్‌' అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక మైదానంలో గబ్బర్‌ ఆటను చూడలేమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Story first published: Thursday, June 20, 2019, 9:24 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X