Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌.. 14 పరుగులకు 3 వికెట్లు

ICC Cricket World Cup 2019, Australia vs England Semi Final: Woakes, Archer put England on top, Australia lost Finch, Warner and Handscomb

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. జట్టు స్కోర్ 10 పరుగులకే ఓపెనర్లు ఆరోన్ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌ పరుగుల ఖాతాను బౌండరీతో ఆరంభించాడు. అయితే ఎదుర్కొన్న తొలి బంతికే ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ (0; 1 బంతుల్లో) గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. ఆర్చర్‌ వేసిన 1.1వ బంతికి ఫించ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. అంపైర్‌ ఔటిచ్చినా.. ఫించ్ సమీక్ష కోరినా ఫలితం దక్కలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్రిస్‌ వోక్స్‌ వేసిన 2.4వ బంతికి డేవిడ్‌ వార్నర్‌ (9; 11 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్స్‌ను కోల్పోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఇక ఈ సమయంలో వోక్స్‌ వేసిన 6.1వ బంతికి హ్యాండ్స్‌కాంబ్‌ (4; 12 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఆసీస్‌ మూడో వికెట్‌ చేజార్చుకుని తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఆర్చర్‌ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతి అలెక్స్‌ కారీ దవడ ముందు భాగంలో గట్టిగ తగిలింది. వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి ఫిజియో వచ్చి బ్యాండేజ్‌ వేసి చికిత్స చేసాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్ కారీ (9), స్టీవ్ స్మిత్‌ (3)లు ఉన్నారు. వోక్స్ రెండు వికెట్లు తీసాడు.

Story first published: Thursday, July 11, 2019, 16:00 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+