Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో సెమీస్‌ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ICC Cricket World Cup 2019, Australia vs England Semi Final: Australia have won the toss and have opted to bat

బర్మింగ్‌హామ్ వేదికగా మరికొద్ది సేపట్లో రెండో సెమీస్‌ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. గాయపడిన ఉస్మాన్ ఖవాజా స్థానంలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మొదటగా బ్యాటింగ్ చేసి భారీ చేయాలనుకుంటున్నాం అని ఫించ్ తెలిపాడు. ఇంతకుముందు ఇక్కడ టీమిండియాతో ఆడాం. 340 పరుగులు చేసే అవకాశం ఉంది. ఇది ఛేజింగ్ కూడా చేయొచ్చు అని మోర్గాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పులేదు. అయితే ఆకాశం మేఘావృత్తమై ఉంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇలాగే ఉండనుందట. మ్యాచ్ ఈ రోజే పూర్తిగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

{headtohead_cricket_1_2}

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియా అలవోకగా సెమీస్‌లో అడుగుపెడితే.. ఆతిథ్య ఇంగ్లండ్‌ చెమటోడ్చి చేరింది. ప్రపంచకప్ కలను సొంతగడ్డపై సాకారం చేసుకునేందుకు ఇంగ్లాండ్ జట్టుకు ఇదే మంచి అవకాశం. చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ను ఎలాగైనా ఓడించి తుదిపోరులో అడుగుపెట్టాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆరో టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలో చిత్తుచేసినట్టే సెమీస్‌లోనూ ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ఫైనల్ చేరాలని భావిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది.

1
43690

జట్లు:
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్‌, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌, స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌, మార్కస్ స్టొయినిస్‌, నాథన్ లియాన్‌, జేసన్ బెహ్రెన్‌ డార్ఫ్‌, పాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌.

ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), జోస్ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, లియామ్ ఫ్లంకెట్‌, ఆదిల్ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌, మార్క్‌ ఉడ్‌.

Story first published: Thursday, July 11, 2019, 14:54 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+