For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్‌ 16 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన జో రూట్‌

ICC Cricket World Cup 2019, Australia vs England: England player Joe Root breaks Ricky Pontings 16-year old World Cup record

ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ ప్రపంచకప్‌-2019లో సరికొత్త రికార్డు సృష్టించాడు. వికెట్‌ కీపర్‌ కాకుండా ఓ ఫీల్డర్‌ ఒక ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు (12) అందుకున్న ఆటగాడిగా రూట్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో నాకౌట్‌ మ్యాచ్‌లో రహిద్ బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకొని ఈ ఘనత సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట (11) ఉన్న రికార్డు బద్దలైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత 16 ఏళ్ల పాటు పాయింటింగ్ పేరిట ఈ రికార్డు పదిలంగా ఉంది. 2003 ప్రపంచకప్‌లో పాంటింగ్‌ 11 క్యాచ్‌లు అందుకొన్నాడు. అయితే ఈ టోర్నీలో రూట్‌ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ (10), ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో (9) వరుసగా అత్యధిక క్యాచ్‌లు అందుకున్నారు. ఇక వికెట్‌ కీపర్ల జాబితాలో ఆసీస్‌ కీపర్‌ ఆలెక్స్‌ కారి (17 క్యాచ్‌లు, 2 స్టంపింగులు) తొలి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ కీపర్‌ టామ్‌లాథమ్‌ (18), వెస్టిండీస్‌ కీపర్‌ షైహోప్‌ (16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ కీపింగ్ లో కూడా విఫలమయిన విషయం తెలిసిందే.

గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. రాయ్‌కు తోడు రూట్‌ (40 నాటౌట్‌), మోర్గాన్‌ (40 నాటౌట్‌), బెయిర్‌ స్టో (34)లు రాణించడంతో ఇంగ్లండ్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. స్టీవెన్‌ స్మిత్‌ (85; 119 బంతుల్లో 6×4), కేరీ (46; 70 బంతుల్లో 4×4) పోరాడారు. క్రిస్‌ వోక్స్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Friday, July 12, 2019, 15:24 [IST]
Other articles published on Jul 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+