Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్‌ 'ఢీ'.. బంగ్లా నిలువగలదా?

ICC Cricket World Cup 2019 : Australia V Bangladesh Match Preview || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, Australia vs Bangladesh Predicted Playing XI: Stoinis, Coulter-Nile Return for Australia, Bangladesh Unchanged

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్‌ ఢీ కొట్టనుంది. వరుస విజయాలతో ఆసీస్ సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. భారత్‌ చేతిలో మాత్రమే ఆసీస్ ఓడింది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 5 పాయింట్లు సాధించింది బంగ్లా. మరో మ్యాచ్ వర్షార్పణం అయింది. న్యూజీలాండ్, ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియాలను దాటి సెమీస్ చేరాలంటే ఇక బంగ్లాకు ప్రతి మ్యాచ్ కీలకమే. మరి పటిష్ట ఆస్ట్రేలియా ముందు బంగ్లా నిలువగలదా?.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కంగారూలకు ఎదురుందా:

కంగారూలకు ఎదురుందా:

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆసీస్‌ సమతూకంగా ఉంది. టాపార్డర్‌లో డేవిడ్‌ వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. మిడిలార్డర్‌లో ఖవాజా, మ్యాక్స్‌వెల్‌, క్యారీలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. గాయపడిన ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చే చాన్స్‌ ఉంది. స్టొయినిస్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే మార్ష్ బెంచ్‌కు పరిమితం కావొచ్చు. కౌల్టర్‌నైల్‌ కూడా జట్టులోకి రానున్నాడు. బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, రిచర్డ్‌సన్‌లను బంగ్లా ఎదుర్కోవడం కష్టమే.

ఫామ్‌లో షకీబ్‌:

ఫామ్‌లో షకీబ్‌:

గత మ్యాచ్‌లో బంగ్లా అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 300 పైచిలుకు లక్ష్యాన్ని ఆల్‌రౌండర్‌ షకీబ్‌ వీరోచిత పోరాటంతో బంగ్లాదేశ్‌ అలవోకగా ఛేదించింది. లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్, తమీమ్‌లు ఫామ్ అందుకోవడం బంగ్లా జట్టుకు సానుకూలాంశం. రహీం, షబ్బీర్, మహ్మదుల్లాలు బ్యాట్ జులిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ముస్తాఫిజుర్, మోర్తజా, షకీబ్, సైఫుద్దీన్, హాసన్ ఉన్నారు. బంగ్లాకు కలిసొస్తే ఆసీస్‌కు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆస్ట్రేలియాదే పైచేయి:

ఆస్ట్రేలియాదే పైచేయి:

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. బంగ్లాదేశ్‌ ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వికెట్‌ పొడిగా ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్, ముష్ఫికర్, లిటన్‌ దాస్, మహ్ముదుల్లా, మొసద్దిక్, సైఫుద్దీన్, ముస్తఫిజుర్, మిరాజ్‌.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా:

ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, మార్ష్/స్టొయినిస్, క్యారీ, జంపా, కమిన్స్, స్టార్క్, కౌల్టర్‌నైల్‌.

Story first published: Thursday, June 20, 2019, 8:51 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+