Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్‌ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

ICC Cricket World Cup 2019, Australia vs Bangladesh: David Warner ton, Usman Khawaja Half Century helps Australia dominate

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓ‍పెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్‌ సెంచరీ చేసాడు. 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో వార్నర్‌ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో వార్నర్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. 16వ వన్డే సెంచరీ.

1
43669

టాస్‌ గెలిచి మొదటగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అరోన్‌ ఫించ్‌, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్‌ (53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రూబెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అప్పటికే హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న వార్నర్‌కు ఉస్మాన్‌ ఖవాజా చక్కటి సహకారం అందించాడు. వీరు బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వార్నర్‌ ఫామ్ కొనసాగిస్తూ సెంచరీ చేసాడు. ఈ ఇద్దరు మరో మంచి భాగస్వామ్యాన్ని (129) సాధించారు. సెంచరీ అనంతరం వార్నర్ బౌండరీలతో హోరెత్తించాడు. మరోవైపు ఖవాజా కూడా హాఫ్ సెంచరీ చేసాడు. దాంతో ఆసీస్‌ 41 ఓవర్లు ముగిసే సరికి ఓక వికెట్‌ నష్టానికి 263 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్‌ (143), ఖవాజా (57)లు ఉన్నారు.

Story first published: Thursday, June 20, 2019, 18:18 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+