Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఇరుజట్లు మార్పులతో బరిలోకి

ICC Cricket World Cup 2019, Australia vs Bangladesh: Australia have won the toss and have opted to bat

ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ మూడు మార్పులు చేసింది. స్టొయినిస్, కౌల్టర్‌నైల్‌, జంపా జట్టులోకి వచ్చారు. మరోవైపు బంగ్లా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రూబెల్, షబ్బీర్ తుది జట్టులోకి వచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వరుస విజయాలతో ఆసీస్ సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి అగ్రస్థానంకు చేరుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 5 పాయింట్లు సాధించింది బంగ్లా. సెమీస్ చేరాలంటే బంగ్లాకు ఈ మ్యాచ్ కీలకం. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వికెట్‌ పొడిగా ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

{headtohead_cricket_1_10}

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. బంగ్లాదేశ్‌ ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌ విజయం సాధించింది.

1
43669

జట్లు:
బంగ్లాదేశ్‌: తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్, ముష్ఫికర్, లిటన్‌ దాస్, మహ్ముదుల్లా, షబ్బీర్ రెహమాన్, మెహిదీ హాసన్, మొర్తజా (కెప్టెన్‌), రూబెల్, ముస్తఫిజుర్.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖవాజా , స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కౌల్టర్‌నైల్‌, జంపా, కమిన్స్, స్టార్క్.

Story first published: Thursday, June 20, 2019, 15:01 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+