Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా సెంచరీ కంటే.. జట్టుకు ఆ రెండు పాయింట్లే ముఖ్యం

ICC Cricket World Cup 2019, Australia vs Bangladesh: 16 hundreds are great but for us its about getting 2 points says David Warner

నేను సెంచరీ చేసిన దాని కంటే.. ఈ విజయంతో జట్టుకు లభించిన 2 పాయింట్లే ముఖ్యం అని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్నర్‌ సెంచరీ (166: 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసాడు. ఇది వన్డేల్లో 16వ సెంచరీ. దీంతో మాజీ క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్ సరసన వార్నర్ చేరాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రెండు పాయింట్లే ముఖ్యం:

రెండు పాయింట్లే ముఖ్యం:

సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. అవార్డు అందుకున్న అనంతరం వార్నర్‌ మాట్లాడుతూ... 'గిల్‌క్రిస్ట్‌ సరసన నిలవడం ప్రత్యేకం. నేను సెంచరీ చేసిన దాని కంటే.. ఈ విజయంతో మా జట్టుకు లభించిన 2 పాయింట్లే నాకు ముఖ్యం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడం సంతోషాన్ని కలిగించింది' అని వార్నర్ పేర్కొన్నారు.

వికెట్లు కాపాడుకోవడం ముఖ్యం:

వికెట్లు కాపాడుకోవడం ముఖ్యం:

'ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో బంగ్లా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో మొదట్లో నిలదొక్కుకొవడానికి ప్రయత్నించా. వన్డేల్లో వికెట్లు కాపాడుకోవడం ముఖ్యం. కొత్త బంతిని అర్థం చేసుకొని కుదురుకున్నాకే స్వేచ్ఛగా ఆడాలి. అప్పుడు పరుగులు అవే వస్తాయి. బంగ్లా బాగా పోరాడింది. రహీం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టా. టోర్నీలో పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తా' అని వార్నర్ చెప్పుకొచ్చారు.

110 ఇన్నింగ్స్‌లో 16వ సెంచరీ:

110 ఇన్నింగ్స్‌లో 16వ సెంచరీ:

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ 110 ఇన్నింగ్స్‌లోనే 16వ సెంచరీ సాధించారు. దక్షిణాఫ్రికా సీనియర్ ప్లేయర్ హషీమ్‌ ఆమ్లా ఈ రికార్డును 94 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లో 150కి పైగా పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, మాజీ వికెట్‌కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేరిట ఉండేది.

ఆసీస్ విజయం:

ఆసీస్ విజయం:

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులే చేసింది. బంగ్లా ముష్పీకర్‌ రహీమ్‌ (102 నాటౌట్‌; 97 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్సర్‌)సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు డేవిడ్‌ వార్నర్‌ సెంచరీతో కదం తొక్కడంతో ఆసీస్ 381 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Story first published: Friday, June 21, 2019, 14:09 [IST]
Other articles published on Jun 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+