
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వీరిద్దరూ చక్కటి భాగస్వామ్యంతో పరుగుల వరద పారిస్తున్నారు. మ్యాచ్ ఆరంభంలో నిలకడగా ఆడిన ఓపెనర్లు, ఆ తర్వాత పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా... ఆ తర్వాత డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీని సాధించాడు.
అయితే, జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (82)ను అమిర్ పెవిలియన్‌కు పంపించడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా 1996 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్‌పై పాకిస్తాన్ జట్టుపై ఓపెనర్లు వందకు పైగా పరుగల భాగస్వామ్యం నమోదు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్-ఫించ్‌ల జోడీ అరుదైన ఘనత సాధించింది.
1996 ప్రపంచకప్‌లో పాక్‌పై ఇంగ్లండ్ ఓపెనర్లు స్మిత్, మికీ అథెర్టన్‌లు తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఐదు ప్రపంచకప్‌ల తర్వాత తొలి వికెట్‌కు సెంచరీ భాగస్మామ్యం నమోదు చేసిన జోడిగా వార్నర్-ఫించ్‌లు నిలిచారు. పాక్‌పై వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆసీస్ ఓపెనర్లుగా ఫించ్, వార్నర్‌లు అరుదైన గుర్తింపు పొందారు.
ప్రస్తుతం 27 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(8), డేవిడ్ వార్నర్(67) పరుగులతో ఉన్నారు.
ప్రపంచకప్‌లో పాక్‌పై 100కుపైగా భాగస్వామ్యాలు నమోదు చేసిన ఓపెనర్లు:
132 G Greenidge - D Haynes, Oval, 1979
115 G Fowler - C Tavare, Manchester, 1983
175* D Haynes - B Lara, MCG, 1992
147 R Smith - M Atherton, Karachi, 1996
100*D Warner - A Finch, Taunton, 2019 *
{headtohead_cricket_1_5}