Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. వెస్టిండీస్‌కు ఆసీస్ పేసర్ హెచ్చరిక

ICC Cricket World Cup 2019: Australia Pacer Nathan Coulter-Nile warns Westindies batsmens

తన బౌన్సర్లతో బెంబేలెత్తిస్తానని వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌లకు ఆస్ట్రేలియా పేసర్ కౌల్టర్‌నైల్ హెచ్చరికలు జారీ చేసాడు. ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 6న ఆస్ట్రేలియా తమ రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. దీంతో మ్యాచ్‌కు ముందే కౌల్టర్‌నైల్ మాటల యుద్దానికి తెరలేపాడు. ఇలా స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విండీస్ తన తొలి మ్యాచులో పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విండీస్ ఫాస్ట్ బౌలర్లు ఓషానో థామస్, కాట్రెల్, హోల్డర్, రస్సెల్ షార్ట్‌పిచ్ బంతులతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్ పంపారు. ఈ నేపథ్యంలో తాము కూడా షార్ట్‌పిచ్ బంతులతో విండీస్ పని పడుతామని కౌల్టర్‌నైల్ హెచ్చరించాడు.

1
43649

'పాక్‌పై విండీస్ బౌలర్లు షార్ట్‌పిచ్ బంతులతో విరుచుకుపడ్డారు. మేము కూడా షార్ట్‌పిచ్ బంతులనే ఉపయోగిస్తాం. వెస్టిండీస్‌ను కట్టడి చేస్తాం. భారీ హిట్టర్లు ఉన్న విండీస్ ఎప్పుడైనా ప్రమాదకరమే. ఓవర్‌కు రెండు బౌన్సర్ల అవకాశాన్ని మేమూ వినియోగించునుకుంటాం. మైదానాలు చాలా చిన్నవిగా ఉండటం, వికెట్ కూడా ఫ్లాట్‌గా ఉంది. దీంతో బౌన్సర్ల అస్త్రం పనికొస్తుంది. గేల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను పరుగులు చేయకుండా ఆపాలంటే ఒత్తిడి పెంచాలి' అని కౌల్టర్‌నైల్ పేర్కొన్నాడు.

Story first published: Monday, June 3, 2019, 15:27 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+