న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రస్తుత ఫామ్‌ చూస్తే.. ప్రపంచకప్‌ ఆ జట్టే గెలుస్తుంది

ICC Cricket World Cup 2019: Australia Ex Bowler Glenn McGrath picks his favourite to win the title

ఇంగ్లాండ్‌ జట్టే నా ఫేవరెట్‌. ఇంగ్లాండ్‌ ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ గెలిచేలా ఉంది అని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ తెలిపారు. మే 30 నుండి మెగా సమరం ప్రపంచకప్‌ పోరు జరగనుంది. ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే మాజీ క్రికెటర్లు తమ ఫేవరెట్‌ జట్టు ఎదో, ఏ జట్టు కప్ గెలుస్తుందో అని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా మెక్‌గ్రాత్‌ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

నా ఫేవరెట్‌ ఇంగ్లాండే:

నా ఫేవరెట్‌ ఇంగ్లాండే:

'ఇంగ్లాండ్‌ మంచి వన్డే జట్టు. ఈ టోర్నీలో నా ఫేవరెట్‌ జట్టు ఇంగ్లాండే. ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ గెలిచేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్‌ ఆట నన్ను ఆకట్టుకుంది. భారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు, అదే సమయంలో ఛేదిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇంగ్లాండ్‌ పటిష్టంగా ఉంది. ఇక జట్టులో ఎక్కువగా ఆల్‌రౌండర్‌లు ఉండడం కలిసొచ్చే అంశం' అని మెక్‌గ్రాత్‌ అన్నారు.

టీ20 క్రికెట్‌ వల్లే:

టీ20 క్రికెట్‌ వల్లే:

'మాములుగా జట్లు అన్ని తొలి 15 ఓవర్లు, చివరి 15 ఓవర్లలో హార్డ్‌ హిట్టింగ్‌ చేస్తాయి. ఇక మధ్య ఓవర్లలో డబుల్స్‌, సింగిల్స్‌లు తీస్తాయి. ఇంగ్లాండ్‌, భారత్‌ మాత్రం అన్ని ఓవర్లలోనూ హార్డ్‌ హిట్టింగ్‌ చేస్తున్నాయి. రెండు జట్లలో భారీ హీటర్లు ఉన్నారు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది. టీ20 క్రికెట్‌ వల్లే ఇలా ఆడుతున్నారు' అని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నారు.

ఫైనల్లో ఆస్ట్రేలియా:

ఫైనల్లో ఆస్ట్రేలియా:

'కప్ కచ్చితంగా ఇంగ్లాండే గెలుస్తుందని చెప్పడం లేదు. నా ఫేవరెట్‌ జట్టు అని అంటున్నా. సొంతగడ్డపై వారిని ఓడించడం కష్టమే. భారత్‌కు కూడా ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా సైతం బాగా ఆడుతోంది. దక్షిణాఫ్రికా ఎప్పటికీ మంచి జట్టే. పాక్‌, వెస్టిండీస్‌ ఎప్పుడు ఎలా ఆడుతాయో తెలియదు. అందుకే ఈ ప్రపంచకప్‌ అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఆస్ట్రేలియాను ఫైనల్లో చూస్తాను' అని మెక్‌గ్రాత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Story first published: Tuesday, May 28, 2019, 10:49 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X