Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడాస్ఫూర్తి.. స్టాయినిస్‌కు మలింగ సూచనలు

ICC Cricket World Cup 2019: Malinga Teaches Stoinis How To Bowl A Slower Ball | Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Aus v SL, CWC19 WU7: Lasith Malinga shared trade secrets with Marcus Stoinis

శ్రీలంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఆటగాడు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా సూచనలు ఇచ్చాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర పరాజయంను చవిచూసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌.. మలింగ దగ్గరకు వచ్చి స్లో బంతులు ఎలా విసరాలో అని అడిగాడు. ప్రత్యర్థి ఆటగాడు అని చూడకూండా మలింగ కొన్ని సూచనలు చేశాడు. అంతేకాదు స్వయంగా కొన్ని బంతులు వేసి చూపించాడు. దీంతో మలింగపై అందరూ ప్రశంశల వర్షం కురిపించారు. మలింగ క్రీడాస్ఫూర్తిని మెచ్చుకొంటూ ఐసీసీ కూడా ఓ ట్వీట్‌ చేసింది. 'పరాజయం అనంతరం కూడా స్టాయినిస్‌కు మలింగ స్లో బంతుల రహస్యం చెప్పాడు. క్రీడా స్ఫూర్తి అంటే ఇదే' అని ఐసీసీ ట్వీట్‌ చేసింది.

మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మలింగ మాట్లాడుతూ... 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైవిధ్యం చాలా ముఖ్యం. నా సాయం కోరిన ప్రతి ఒక్కరికీ సూచనలు, రహస్యాలూ చెపుతాను. ఎలాంటి పరిస్థితుల్లో స్లో బంతులు వేయాలి, అప్పుడు బంతిని ఎలా పట్టుకోవాలని స్టాయినిస్‌కు చెప్పాను. అతనికి సలహాలు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో స్టాయినిస్‌ స్లో బంతులు వేస్తాడని అనుకుంటున్నా' అని మలింగ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 29, 2019, 10:25 [IST]
Other articles published on May 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+