పాకిస్థాన్ ప్రపంచకప్ జట్టులో ఆమిర్‌కు చోటు

పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ ఆమిర్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఆమిర్‌తో పాటు అసిఫ్ అలీకి కూడా జట్టులో స్థానం లభించింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రపంచకప్‌కు వెళ్లే పాక్ తుది జట్టు ఖరారు అయింది.

పాకిస్థాన్ బౌలర్లు విఫలం:
ఇంగ్లాండ్‌తో ఓ టీ20, మూడు వన్డేల్లో పాకిస్థాన్ బౌలర్లు ఘోరంగా విఫలమైయ్యారు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న బౌలర్లు కూడా దారుణ ప్రదర్శన చేశారు. ఇదే సమయంలో ఆమిర్ చికెన్ పాక్స్ నుండి కొలుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండర్ అసిఫ్ అలీ వరుసగా రెండు అర్ధ సెంచరీలు బాదాడు.

సెలక్షన్ కమిటీ చర్చలు:
ప్రపంచకప్‌కు వెళ్లే తుది జట్టును ఈ నెల 23లోగా ప్రకటించాలి. ఏవైనా మార్పులు ఉంటే ఈ సమయంలోగా చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పాక్ హెడ్ కోచ్ మిక్కీ ఆథర్, కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్, సెలెక్టర్ ఇంజమామ్ కలిసి చర్చలు జరిపారు. అనంతరం ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్, ఓపెనర్ అబిద్ అలీ స్థానాల్లో మహ్మద్ ఆమిర్, అసిఫ్ అలీలకు అవకాశం కల్పించారు.

ఛాంపియన్ ట్రోఫీ ప్రదర్శనతో చోటు:
పీసీబీ తాజా నిర్ణయంతో ప్రపంచకప్‌కు వెళ్లే పాక్ తుది జట్టు ఖరారు అయింది. పేలవ ఫామ్ కారణంగా ఇంతకుముందు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఆమిర్‌కు స్థానం లభించలేదు. అయితే ఛాంపియన్ ట్రోఫీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని.. అతనిపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. మే 30 నుండి ప్రపంచకప్ ప్రారంభమవనుండగా.. మే 31న విండీస్ జట్టుతో పాక్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications