Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ కోసం 80వేల మంది ఫ్లయిటెక్కనున్నారు

ICC Cricket World Cup 2019: Around 80,000 Indian fans likely to travel to UK

మే 30 నుంచి ఇంగ్లండ్‌, వేల్స్‌ వేదికగా పన్నెండో వన్డే ప్రపంచకప్‌ మెగా సమరం ప్రారంభం కానుంది. భారత్‌లో క్రికెట్‌ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. ఇక ఈ టోర్నీలో టీమిండియా ఫెవరేట్‌గా బరిలోకి దిగుతుండడంతో అభిమానులలో మ్యాచ్ చూడాలనే కోరిక మరింత బలపడింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యూకే వీసాల కోసం అభిమానులు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారట.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌లు చూసేందుకు భారత్‌ నుంచి అత్యధికంగా సుమారు 80 వేల మంది యూకేకి పయనించే అవకాశముందని బ్రిటీష్‌ హైకమిషన్‌ (బీహెచ్‌సీ) అధికార ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు. 'రోజుకు సగటున 3500 మంది వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది వస్తోరో తెలియదు. కానీ భారత్‌ నుంచి మాత్రం అధిక సంఖ్యలో వస్తారని అనుకుంటున్నాం. రెండు దేశాల మధ్య మెరుగైన విమానసేవలు కూడా ఉండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని' పేర్కొన్నారు.

'ఫిబ్రవరి నుంచే భారత్‌లో ప్రపంచకప్‌ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానించే ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్లు భారీగా నిర్వహించాం. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఏడు కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ముందస్తుగా వీసా దరఖాస్తు చేసుకొనే వీలు కల్పించాం. ఏప్రిల్‌ నుంచి ప్రపంచకప్‌ ముగిసేవరకు రెండో విడత ప్రచారం నిర్వహిస్తున్నాం. చివరి నిమిషంలో ప్రయాణించే వారికి కూడా ప్రయారిటీ వీసా అందుబాటులో ఉంచాం. దీంతో వీసా ఐదు రోజుల్లోనే వస్తుంది. తద్వారా అభిమానులు చూడాలనుకున్న మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కలుగుతుంది' అని ఆ అధికారి అన్నారు.

Story first published: Saturday, May 18, 2019, 11:34 [IST]
Other articles published on May 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+