Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు నెట్ బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్

ICC Cricket World Cup 2019 : Arjun Tendulkar Bowls At The England Batsmen In The Nets || Oneindia
ICC Cricket World Cup 2019: Arjun Tendulkar bowls at the England batsmen in the nets

హైదరాబాద్: టోర్నీలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రణాళికను సిద్దం చేసింది. ఇందులో భాగంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ని నెట్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ జట్టు తరుఫున అర్జున్ టెండూల్కర్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు.

ఇటీవలే సర్రే క్రికెట్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి, అర్జున్ టెండూల్కర్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. అర్జున్ టెండూల్కర్ ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో అతడి బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చనే ఆలోచనలో ఉంది.

ఇందులో భాగంగా ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లకు అర్జున్ టెండూల్కర్ సోమవారం నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగింటిలో విజయం సాధించింది. ఈ టోర్నీలో కోహ్లీసేనతో ఆడిన మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

Story first published: Monday, June 24, 2019, 19:31 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+