For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1992 ప్రపంచకప్ చరిత్ర పునరావృతం కాదు.. పాక్‌ కప్‌ కొట్టదు

ICC Cricket World Cup 2019: Anand Mahindra takes kickass dig at Pakistan after Ind vs Eng match: History doesnt repeat

1992 ప్రపంచకప్ చరిత్ర పునరావృతం కాదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కప్‌ కొట్టలేదు అని వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. మెగా టోర్నీ ప్రపంచకప్‌ సమరం రసవత్తరంగా సాగుతోంది. లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుతుండటంతో.. సెమీస్‌లోని నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌లు అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించగా.. శ్రీలంక అనధికారికంగా సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా 14 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌, భారత్ 11 పాయింట్లతో ఉన్నాయి. రెండు జట్లు ఒక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్‌ చేరడం ఖాయం. ఒక స్థానం కోసం ఇంగ్లండ్‌, పాక్, బంగ్లాలు పోటీ పడుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. నాలుగు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓడిపోయింది. ఇక ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో పాక్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌ సెమీస్‌ చేరాలంటే 5న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అయితే అంతకన్నా ముందు ఇంగ్లండ్‌ జట్టు కివీస్‌పై ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఆదివారం టీంఇండియా చేతిలో ఇంగ్లండ్ ఓడితే పాక్‌కు సెమీస్ అవకాశాలు మరింత సులువయ్యేయి.

అయితే సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహింద్రా ప్రపంచకప్ పరిణామాలపై స్పందించారు. ఇంగ్లండ్ చేతిలో టీంఇండియా ఓటమి అనంతరం పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. 'పాకిస్తాన్‌ సెమీస్ నుండి వెళ్లిపోవాలని కోరుకుంటే.. ఇంగ్లండ్‌, భారత్ మ్యాచ్ చూడమని చాలా మంది కోరారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో చెస్‌ తరహాలో టీమిండియా ఎత్తులకు పైఎత్తులు వేసి పాక్‌ను సెమీస్‌ రేసు నుంచి ఔట్‌ చేసింది. 1992 ప్రపంచకప్ పరిస్థితులే పాక్‌కు పునరావృతం అవుతున్నాయన్న వార్తలలో పసలేదు. చరిత్ర ఎప్పటికి పునరావృతం కాదు. పాకిస్తాన్‌కు కప్‌ కొట్టలేదు' అని మహింద్రా పేర్కొన్నారు.

Story first published: Tuesday, July 2, 2019, 11:04 [IST]
Other articles published on Jul 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+