'టీమిండియాలో హార్దిక్ పాండ్యా ప్రతిభకు ఎవరూ సరితూగలేరు'

టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియాలో హార్దిక్ పాండ్యా ప్రతిభకు ఎవరూ సరితూగలేరని సెహ్వాగ్ అన్నారు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 12లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు బ్యాటు, మరోవైపు బంతితో రాణించి ఔరా అనిపించాడు. ముంబై ఇండియన్స్‌కు కప్ గెలవడంతో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడు.

పాండ్యా ప్రతిభతో ఎవరూ సరితూగలేరు:
త్వరలో ప్రపంచకప్ మొదలవనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రతిభపై సెహ్వాగ్ స్పందించారు. 'బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా ప్రతిభకు దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఒకవేళ బీసీసీఐ ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్లు ఎవరైనా సమానంగా ఉండి ఉంటే.. పాండ్యా తిరిగి జట్టుకు ఎంపికయ్యేవాడే కాదు' అని సెహ్వాగ్ అన్నారు.

402 పరుగులు.. 14 వికెట్లు:
కాఫీ విత్ కరణ్ షో వివాదంతో హార్దిక్, కేఎల్ రాహుల్‌లపై బీసీసీఐ తాత్కాలిక సస్పెన్షన్‌తో పాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఐపీఎల్ 12లో ఈ ఇద్దరు అదరగొట్టారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ.. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 191.42 స్ట్రెక్‌రేట్‌తో 402 పరుగులు చేసాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 91. ఇక బంతితో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మ్యాచ్ ఫినిషర్:
మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టు 15 మంది సభ్యులలో హార్దిక్ కూడా ఒకడు. ఈ టోర్నీలో అతడు తన ముద్రను వేసే అవకాశం ఉంది. మ్యాచ్ కీలక సమయంలో తన హార్డ్ హిట్టింగ్ తో బ్యాట్ జులిపించగలడు అని ఐపీఎల్ ద్వారా నిరూపించాడు. జాదవ్, ధోనీలతో కలిసి ఫినిషింగ్ ఇవ్వగలడని అందరూ భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications