న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. భారత్‌తో మ్యాచ్‌కు ఆమ్లా సిద్ధం

ICC Cricket World Cup 2019: Hashim Amla Could Be Fit For India Clash?? | Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Africa vs Bangladesh Match: South Africa expect Openar Hashim Amla to be fit for India Match

గాయాలతో సతమవుతున్న సౌతాఫ్రికా జట్టుకు శుభవార్త అందింది. సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్‌ హషీం ఆమ్లా గాయం నుంచి కోలుకుంటున్నాడట. దీంతో భారత్‌తో మ్యాచ్ వరకు ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధించి.. ఆ మ్యాచ్‌లో ఆడుతాడని సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో గాయం:

ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో గాయం:

ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హషీం ఆమ్లా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ హెల్మెట్‌ గ్రిల్‌కు బలంగా తాకడంతో ఆమ్లా గాయపడ్డాడు. వెంటనే అతను మైదానాన్ని వీడడంతో చికిత్స అందించారు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కష్టాల్లో పడగా.. ఆమ్లా తిరిగి క్రీజులోకి వచ్చినా త్వరగానే పెవిలియన్ చేరాడు.

భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధం

భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధం

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బంగ్లాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ఆమ్లా దూరమయ్యాడు. ఆదివారం మ్యాచ్ జరుగుతున్నపుడు ఆమ్లా డ్రెసింగ్ రూమ్ లో సహచరులతో కలిసి మాట్లాడుతూ కనిపించాడు. అయితే భారత్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌కల్లా ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధిస్తాడు, ఆ మ్యాచ్‌లో ఆమ్లా ఆడుతాడు అని టీమ్‌ మేనేజర్‌ మొహమ్మద్‌ మూసాజీ చెప్పాడు.

ఎంగిడికి గాయం:

ఎంగిడికి గాయం:

గాయాల కారణంగా దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు ఆమ్లా, స్టెయిన్‌ల సేవలు కోల్పోయింది. ఇపుడు మరో పేసర్‌ లుంగీ ఎన్‌గిడి కూడా గాయం బారిన పడ్డాడు. ఆదివారం బంగ్లాతో మ్యాచ్‌లో ఏడు ఓవర్లు ముగిశాక ఎన్‌గిడి ఎడమ తొడ కండరాల నొప్పితో మైదానం వీడాడు. ఎన్‌గిడి కోలుకోవడానికి 7-10 రోజుల సమయం పడుతుందట. దీంతో భారత్‌తో మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ఎన్‌గిడి గాయం అయ్యే సమయానికి నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చాడు.

బంగ్లాదేశ్‌ బోణీ:

బంగ్లాదేశ్‌ బోణీ:

ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (80 బంతుల్లో 78; 8 ఫోర్లు), షకీబ్‌ అల్‌ హసన్‌ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (53 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేయగా.. జేపీ డుమిని (37 బంతుల్లో 45; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (56 బంతుల్లో 45; 4 ఫోర్లు), వాన్‌ డర్‌ డసెన్‌ (38 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు.

Story first published: Monday, June 3, 2019, 9:40 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X