Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా లక్ష్యం 331.. బంగ్లా సరికొత్త రికార్డు

ICC Cricket World Cup 2019: Africa vs Bangladesh Match: Shakib, Rahim century stand & Mahmudullah blitz propels BAN to 330

బంగ్లాదేశ్‌ జట్టు ఈ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు అత్యుత్తమ స్కోర్‌ నమోదు చేసింది. ఈ స్కోరుతో దక్షిణాఫ్రికా ముందు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సరికొత్త రికార్డు:

సరికొత్త రికార్డు:

మరోవైపు ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని కూడా బంగ్లా నమోదు చేసింది. బంగ్లా ఆటగాళ్లు షకీబుల్‌ హసన్‌, ముష్పికర్‌ రహీమ్‌లు మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇది ప్రపంచకప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యం. అంతకుముందు 141 పరుగుల భాగస్వామ్యం అత్యధికం. గత ప్రపంచకప్‌-2015లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా, ముష్ఫీకర్‌ రహీమ్‌లు 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

చెలరేగిన సౌమ్య సర్కార్‌

చెలరేగిన సౌమ్య సర్కార్‌

టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌లు ఆరంభించారు. ముఖ్యంగా సౌమ్య తన మార్క్ బ్యాటింగ్ చూపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాక ఇక్బాల్‌ (16) ఔటయ్యాడు. అనంతరం మరో 15 పరుగులు జోడించాక వికెట్‌ కీపర్‌ డీకాక్‌ ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్‌ 42 (30 బంతుల్లో 9 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు.

షకీబ్, రహీమ్‌లు అర్ధ సెంచరీలు:

షకీబ్, రహీమ్‌లు అర్ధ సెంచరీలు:

రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును షకిబ్‌ అల్‌ హసన్‌ (75; 84 బంతుల్లో 8x4, 1x6), ముష్ఫికర్‌ రహీమ్‌ (78; 80 బంతుల్లో 8x4)లు అర్ధ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ఈ ఇద్దరు బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 75 పరుగుల వద్ద షకిబ్‌ అవుట్ అయ్యాడు. కాసేపటికి మహ్మద్‌ మిథున్‌ (21).. మరో ఎనిమిది పరుగుల వ్యవధిలో రహీమ్‌ కూడా నిష్క్రమించాడు.

చెలరేగిన మహ్మదుల్లా:

చెలరేగిన మహ్మదుల్లా:

చివరలో మొసెదెక్‌ హుస్సేన్‌ (26: 20 బంతుల్లో 4x4), మహ్మదుల్లా (46 నాటౌట్‌: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌)లు చెలరేగారు. ముఖ్యంగా మహ్మదుల్లా బ్యాట్ జులిపించడంతో బంగ్లా భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్‌, తాహీర్‌, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Sunday, June 2, 2019, 19:59 [IST]
Other articles published on Jun 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+