For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకీబుల్‌, రహీమ్‌ అర్ధ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా బంగ్లాదేశ్

ICC Cricket World Cup 2019: Africa vs Bangladesh Match: Imran Tahir strikes to end Shakib, Rahim century stand

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (67; 75 బంతుల్లో 7x4, 1x6), ముష్ఫికర్‌ రహీమ్‌ (69; 64 బంతుల్లో 8x4)లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ జోడి 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్‌ 37 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఈ ఇద్దరు భారీ షాట్లతో విరుచుకుపడడంతో బంగ్లా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాక ఇక్బాల్‌ (16) ఔటయ్యాడు. అనంతరం మరో 15 జోడించాక వికెట్‌ కీపర్‌ డీకాక్‌ ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్‌ 42( 30 బంతుల్లో 9 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు.

1
43648

కష్టాల్లో ఉన్న జట్టును షకీబ్, రహీమ్‌లు అర్ధ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ఈ ఇద్దరు బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 75 పరుగుల వద్ద షకిబ్‌ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రహీమ్‌ (71), మిథున్ (5) ఉన్నారు. బంగ్లా 37 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బంగ్లా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

Story first published: Sunday, June 2, 2019, 18:24 [IST]
Other articles published on Jun 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+