Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌

ICC Cricket World Cup 2019, Afghanistan vs West Indies: West Indies have won the toss and have opted to bat

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా మరికొద్ది సేపట్లో ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. వెస్టిండీస్‌ కెప్టెన్ జేసన్ హోల్డర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో వెస్టిండీస్‌ బరిలోకి దిగుతోంది. ఏవిన్ లెవిస్, కీమర్ రోచ్ ఆడుతున్నారు. మరోవైపు అఫ్గాన్‌ కూడా రెండు మార్పులు చేసింది. దవ్లత్ జర్ధాన్, షిర్జాద్ జట్టులోకి వచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇప్పటికే ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్‌ 8 మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయం సాధించలేదు. చిన్న జట్టుపైనైనా విజయం సాధించాలని విండీస్ చూస్తుండగా.. విజయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలగాలని అఫ్గాన్‌ భావిస్తోంది.

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఐదు వన్డేలు జరగ్గా.. మూడింట అఫ్గానిస్తాన్, ఒక దాంట్లో వెస్టిండీస్‌ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనే అఫ్గాన్‌ భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ 20 పరుగులు చేస్తే .. వెస్టిండీస్‌ తరఫున స్టార్ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుని అధిగమిస్తాడు. లారా 299 మ్యాచ్‌ల్లో 10,405 పరుగులు చేసి ముందంజలో ఉన్నాడు. గేల్‌ ప్రస్తుతం 297 మ్యాచ్‌ల్లో 10,386 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 20 పరుగులు చేస్తే లారాను అధిగమిస్తాడు.

ఇక 47 పరుగులు చేస్తే.. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ని కూడా గేల్ బద్దలు కొడతాడు. ఇక సెంచరీ చేస్తే మరో విండీస్ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చేరతాడు. ప్రపంచకప్‌లో రిచర్డ్స్‌ మూడు శతకాలు సాధించగా.. గేల్‌ ప్రస్తుతం రెండు శతకాలు చేసాడు. ఇవన్నీ కాకుండా.. గేల్‌ ఒక్క సెంచరీ బాదాడంటే మూడు రికార్డులు బద్దలవుతాయి.

జట్లు:

వెస్టిండీస్‌: జేసన్‌ హెల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, హిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫాబియన్‌ అలెన్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నీ థామస్‌, కీమర్‌ రోచ్‌.

అఫ్గానిస్తాన్‌: గుల్బదిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌ షా, అస్గర్‌ అఫ్గన్‌, మహ్మద్‌ నబీ, సమిల్లాహ్‌ షిన్వారి, నజిబుల్లా జద్రాన్‌, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, రషీద్‌ ఖాన్‌, దవ్లాత్‌ జద్రాన్‌, సయ్యద్‌ షిర్‌జాద్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌.

Story first published: Thursday, July 4, 2019, 14:50 [IST]
Other articles published on Jul 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+