Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్‌ చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌: ఒక్క సెంచరీ చేస్తే.. మూడు రికార్డులు బద్దలు

ICC Cricket World Cup 2019, Afghanistan vs West Indies: Chris Gayle 20 runs away from breaking Brian Lara’s massive ODI record


వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్, యూనివర్స్‌ బాస్ క్రిస్‌ గేల్‌ (40)కు ఇదే చివరి ప్రపంచకప్‌ అన్న విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌ గురువారం అఫ్గానిస్థాన్‌తో తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. క్రిస్‌ గేల్‌ తదుపరి ప్రపంచకప్ ఆడే అవకాశం లేకపోవడంతో.. ఆయనకు ఇదే చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ కానుంది. అయితే చివరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో వెస్టిండీస్‌ తరఫున గేల్‌ మూడు రికార్డులపై కన్నేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

20 పరుగులు:

20 పరుగులు:

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ 20 పరుగులు చేస్తే .. వెస్టిండీస్‌ తరఫున స్టార్ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుని అధిగమిస్తాడు. లారా 299 మ్యాచ్‌ల్లో 10,405 పరుగులు చేసి ముందంజలో ఉన్నాడు. గేల్‌ ప్రస్తుతం 297 మ్యాచ్‌ల్లో 10,386 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 20 పరుగులు చేస్తే లారాను అధిగమిస్తాడు.

ఒక్క సెంచరీ:

ఒక్క సెంచరీ:

ఇక ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేస్తే.. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ని కూడా బద్దలు కొడతాడు. ఇక సెంచరీ చేస్తే మరో విండీస్ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చేరతాడు. ప్రపంచకప్‌లో రిచర్డ్స్‌ మూడు శతకాలు సాధించగా.. గేల్‌ ప్రస్తుతం రెండు శతకాలు చేసాడు. ఇవన్నీ కాకుండా.. గేల్‌ ఒక్క సెంచరీ బాదాడంటే మూడు రికార్డులు బద్దలవుతాయి.

పరువు కోసం:

పరువు కోసం:

లీడ్స్ మైదానం వేదికగా ఈ రోజు మధ్యాహ్నం అఫ్గాన్‌, వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్‌ 8 మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయం సాధించలేదు. చిన్న జట్టుపైనైనా విజయం సాధించాలని విండీస్ చూస్తుండగా.. విజయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలగాలని అఫ్గాన్‌ భావిస్తోంది.

Story first published: Thursday, July 4, 2019, 12:32 [IST]
Other articles published on Jul 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+