న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గాన్‌పై విజయం.. ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ

ICC Cricket World Cup 2019: Afghanistan vs Sri Lanka: Sri Lanka beat Afghanistan by 34 runs (DLS)

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 34 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. మరోవైపు అఫ్గానిస్తాన్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. డక్ వర్త్ పద్దతి ప్రకారం 41 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌.. 32.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బౌలర్లు నువాన్‌ ప్రదీప్‌ (4/31), మలింగ (3/39) సత్తా చాటారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

57 పరుగులకే 4 వికెట్లు:

57 పరుగులకే 4 వికెట్లు:

187 పరుగుల ఛేదనలో అఫ్గాన్‌కు శుభారంభం దక్కలేదు. లంక పేసర్లు విజృంభించడంతో అఫ్గాన్‌ 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షెజాద్‌ (7), రహ్మత్‌షా (2), షాహిది (4), నబి (11) త్వరగానే పెవిలియన్ చేరారు. హజ్రతుల్లా (30) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. కష్టాల్లో పడిన జట్టును నజిబుల్లా (43), నయిబ్‌ (23) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడి భాగస్వామ్యంతో అఫ్గాన్‌ లక్ష్యం దిశగా వెళ్ళింది.

చెలరేగిన ప్రదీప్‌:

ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన ప్రదీప్‌.. నయిబ్‌, రషీద్‌ ఖాన్‌ (2)లను ఔట్‌ చేసి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. మరోవైపు నజిబుల్లా క్రీజులో ఉండడంతో అఫ్గాన్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. నజిబుల్లా పోరాడాడు. లంక కెప్టెన్ కరుణరత్నే అద్భుత త్రోకు నజిబుల్లా రనౌట్‌ అయ్యాడు. ఇక అమీద్ హాసన్ ను మలింగ బోల్డ్ చేయడంతో.. అఫ్గాన్‌ కథ ముగిసింది.

కుశాల్‌ పెరీరా విజృంభణ:

కుశాల్‌ పెరీరా విజృంభణ:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు మంచి ఆరంభం అదిరింది. కరుణరత్నె (30), కుశాల్‌ పెరీరా (78; 81 బంతుల్లో 8×4) ధాటిగా ఆడడంతో లంక 13 ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఈ దశలో నబీ.. కరుణరత్నెను పెవిలియన్ పంపాడు. తిరిమానెతో కలిసి కుశాల్‌ జోరును కొనసాగించడంతో.. లంక 21 ఓవర్లలో 144/1తో భారీ స్కోరు దిశగా వెళ్ళింది.

ఒక్క ఓవర్‌ మూడు వికెట్లు:

నబీ ఒక్క ఓవర్‌ తేడాతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మార్చేశాడు. 22వ ఓవర్లో మొదట తిరిమానె (25)ను క్లీన్‌బౌల్డ్‌ చేసి.. ఆ తర్వాత కుశాల్‌ మెండిస్‌ (2)ను అవుట్ చేసాడు. అదే ఓవర్‌ చివరి బంతికి మాథ్యూస్‌ (0)ను పెవిలియన్ పంపాడు. నబీకి తోడు రషీద్‌ కూడా విజృంభించడంతో.. లంక 33 ఓవర్లలో 189/8తో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. వర్షం ఆగాక ఇన్నింగ్స్‌కు 41 ఓవర్లకు కుదించారు. మళ్లీ బ్యాటింగ్‌ చేసిన లంక.. 18 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Story first published: Wednesday, June 5, 2019, 10:00 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X