Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌.. అఫ్గాన్‌పై విజయం

ICC Cricket World Cup 2019, Afghanistan vs New Zealand: New Zealand beat Afghanistan to make it three wins from three

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జోరు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ వరుసగా మూడో విజయం సాధించి 'హ్యాట్రిక్‌' నమోదు చేసింది. టాంటన్‌ వేదికగా శనివారం జరిగిన డేనైట్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన కివీస్‌.. 7 వికెట్ల తేడాతో గెలిచింది. జిమ్మీ నీషమ్‌ (5/31), లుకీ ఫెర్గుసన్‌ (4/37) నిప్పులు చెరిగే బంతులు.. కెప్టెన్‌ విలియమ్సన్‌ (99 బంతుల్లో 79 నాటౌట్‌; 9 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (52 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌)ల సమయోచిత బ్యాటింగ్ న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గప్తిల్‌ గోల్డెన్ డక్:

గప్తిల్‌ గోల్డెన్ డక్:

173 పరుగుల సాధారణ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 32.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అఫ్తాబ్‌ అలాం బౌలింగ్‌లో ఓపెనర్ గప్తిల్‌ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో కెప్టెన్‌ విలియమ్సన్‌.. మరో ఓపెనర్‌ కొలిన్ మన్రో (22)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఎనిమిదో ఓవర్‌లో అలాం.. మన్రో (22)ను ఔట్ చేసాడు.

కెప్టెన్‌ ఇన్నింగ్స్ :

కెప్టెన్‌ ఇన్నింగ్స్ :

కివీస్ సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌తో విలియమ్సన్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన అలాం టేలర్‌ను బోల్డ్ చేసాడు. అప్పటికే కివీస్ విజయానికి చేరువలో ఉంది. టేలర్‌ ఔటయ్యాక వికెట్ కీపర్ లాథమ్‌ (13 నాటౌట్‌)తో కలిసి విలియమ్సన్‌ మిగతా లాంఛనాన్ని ముగించాడు. కివీస్‌ కోల్పోయిన మూడు వికెట్లూ అఫ్తాబ్‌ అలాం (3/45) తీశాడు.

పేస్‌కు అఫ్గాన్‌ విలవిల:

పేస్‌కు అఫ్గాన్‌ విలవిల:

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా (34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నూర్‌ అలీ (31; 5 ఫోర్లులు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. నీషమ్‌, ఫెర్గుసన్‌ చెలరేగడంతో.. 66 స్కోరు వద్ద ఓపెనర్లతో పాటు రహ్మత్‌ షా (0) ఔటయ్యారు. తర్వాత 4 పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ (4) కూడా పెవిలియన్ చేరడంతో 70 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి అఫ్గాన్‌ కష్టాల్లో పడింది.

హష్మతుల్లా ఒంటరి పోరాటం:

హష్మతుల్లా ఒంటరి పోరాటం:

ఈ దశలో నీషమ్‌, ఫెర్గూసన్‌ మరింత విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ కోలుకోలేకపోయింది. హష్మతుల్లా (59; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. నబీ (9), నజీబుల్లా (4), ఇక్రమ్‌ (2), రషీద్‌ (0)లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనా.. హష్మతుల్లా అర్ధ సెంచరీ చేశాడు. చివరకు అఫ్గాన్‌ 41.1 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. అఫ్గాన్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, శ్రీలంకల చేతుల్లో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చెమటోడ్చి గెలిచింది. అయితే కివీస్‌కు ఇప్పటి నుండే అసలైన పరీక్ష ఎదురుకానుంది. కివీస్‌ ఇప్పటివరకు ఒక్క టాప్ జట్టును కూడా ఎదుర్కోలేదు.

Story first published: Sunday, June 9, 2019, 9:39 [IST]
Other articles published on Jun 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+