Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఫ్గాన్‌‌తో మ్యాచ్‌: అనుమానాలొద్దు, వార్నర్‌ ఫిట్‌గానే ఉన్నాడు

ICC Cricket World Cup 2019: Afghanistan vs Australia: Warner fit to face Afghanistan, confirms Australia captain Finch

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. బ్రిస్టల్‌ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం డిపెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లో వార్నర్‌ గాయపడిన విషయం తెలిసిందే. వార్నర్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం అని గురువారం ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ప్రకటనలో తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

లాంగర్ ప్రకటనతో వార్నర్‌ అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడుతాడో లేదో అని అనుమానాలు నెలకొన్నాయి. అయితే శుక్రవారం వార్నర్‌ ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడుతాడు అని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పష్టం చేసాడు. దీంతో రెగ్యులర్ ఓపెనర్ ఫించ్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వార్నర్‌ గైహాజరీతో గత కొంత కాలంగా ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తూ వస్తున్న ఉస్మాన్ ఖవాజ మూడో స్థానానికి పరిమితం కానున్నాడు.

ఫించ్ మాట్లాడుతూ... 'వార్నర్‌ ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడుతాడు. వార్నర్‌, నేను గతంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. 2015 ప్రపంచకప్‌లో కూడా రాణించాం. పవర్ ప్లేలో వార్నర్‌ బాగా ఆడతాడు. అందుకే అతను మంచి బ్యాట్స్‌మన్లలో ఒకడు. మూడో స్థానంలో ఎవరిని తీసుకున్నా (ఖవాజ, మార్ష్) బాగా ఆడతారు' అని ఫించ్ తెలిపాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో ఇరుక్కుని ఏడాది నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత స్మిత్, వార్నర్‌లకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.

ఆస్ట్రేలియా (అంచనా):
ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఖవాజ, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్యారీ, కౌల్టర్‌నైల్, కమ్మిన్స్, స్టార్క్, జంపా.

Story first published: Saturday, June 1, 2019, 14:43 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+