Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్‌ అంచనాలను అందుకునేనా?

ICC Cricket World Cup 2019: Afghanistan team profile, Team reaches hopes?

క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్ఘానిస్థాన్‌ జట్టు సంచనాలకు మారుపేరు. తనదైన రోజున ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించగలదు. యువ క్రికెటర్లు ఉన్న ఆ జట్టు ఈ మధ్య కాలంలో మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ మేటి జట్లను సైతం ఓడించింది. అద్భుత ప్రదర్శనతో 2015 వరల్డ్‌క్‌పలో తొలిసారి ఆడిన అఫ్ఘాన్‌.. రెండోసారి కూడా మెగా టోర్నీకి సిద్ధమైంది. ఈసారి మాత్రం అఫ్ఘానిస్థాన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా? ఓ సారి చూద్దాం.

 42 వన్డేలు.. 23 విజయాలు:

42 వన్డేలు.. 23 విజయాలు:

గత రెండేళ్లలో అఫ్ఘానిస్థాన్‌ ప్రదర్శన మాములుగా లేదు. 2017 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలను ఓడించి.. భారత్‌, పాకిస్థాన్‌ లాంటి పెద్ద జట్లకు వణుకు పుట్టించింది. దీంతో అఫ్ఘానిస్థాన్‌ జట్టు ఒక్కసారిగా స్టార్ అయింది. ఇక 2017 నుంచి 42 వన్డేలు ఆడిన అఫ్గాన్‌.. 23 మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే, ఐర్లాండ్‌లను అలవోకగా మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ జట్టును తక్కువ అంచనా వేయలేం. కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడా అఫ్ఘానిస్థాన్‌ చెలరేగే అవకాశం ఉంది.

 సీనియర్లకు పెద్దపీట:

సీనియర్లకు పెద్దపీట:

సెలెక్టర్లు ప్రపంచకప్‌ అఫ్ఘాన్‌ జట్టులో సీనియర్లకు పెద్దపీట వేశారు. విశ్వకప్‌నకు కొద్దిరోజుల ముందు అస్గర్‌ అఫ్ఘాన్‌ స్థానంలో గుల్‌బదిన్‌ నయీబ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం జట్టులోని కొంత మందికి ఇష్టం లేదు. ఇక గాయంతో 2016 నుంచి జట్టుకు దూరమైన పేసర్‌ హమీద్‌ హసన్‌కు జట్టులో చోటు కల్పించారు. కొత్తగా జట్టులోకి అరంగేట్రం చేసిన ముజీబుర్‌ రహ్మాన్‌, హజ్రతుల్లా జజాయ్‌కు మాత్రమే జట్టులో చోటు దక్కింది.

వాళ్లే బలం:

వాళ్లే బలం:

బ్యాటింగ్‌ విభాగం కంటే స్పిన్‌ విభాగమే అఫ్ఘాన్‌ జట్టుకు ప్రధాన బలం. స్పిన్ త్రయం రషీద్‌ ఖాన్‌, మొహ్మద్ నబి, ముజీబ్‌ రహ్మాన్‌లపైనే ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌ సహా అన్ని లీగుల్లో సత్తా చాటుకున్నారు. టాప్ బ్యాట్స్‌మెన్‌ను సైతం వీరి బౌలింగ్‌లో తడబడుతున్నారు. ముగ్గురూ భిన్నమైన స్పిన్నర్లే. రషీద్‌ భిన్నంగా బౌలింగ్‌ చేయగలడు, పరుగుల పిసినారి. ఇక నిలకడగా బంతులు వేయడం నబీ ప్రత్యేకత. ముజీబ్‌ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసేందుకు చూస్తుంటాడు. వీరు బ్యాటింగ్ కూడా చేయగలరు. పేస్‌ విభాగంలో హమీద్‌, దౌలత్‌ ఉన్నారు. బ్యాటింగ్‌లో మహమ్మద్‌ షహజాద్‌, హజ్రతుల్లా జజాయ్‌ టాపార్డర్‌లో ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అస్గర్‌ అఫ్గాన్‌ మిడిలార్డర్‌కు బలం. వీరు తప్ప పెద్దగా ఆడేవారు లేరు.

అక్కడ ఆడడం సవాలే:

అక్కడ ఆడడం సవాలే:

ఇంగ్లాండ్‌లో పిచ్‌లపై ఆడిన అనుభవం అఫ్ఘాన్‌ జట్టుకు లేదు. అలవాటులేని పిచ్‌లపై ఆడడం ఆ జట్టుకు పేద సవాలే. సరైన పేస్‌ బౌలర్‌ లేకపోవడం కూడా ప్రతికూలాంశమే. పెద్దగా అనుభవంలేని గుల్‌బదిన్‌కు కెప్టెన్సీ అప్పగించడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై కొందరు ఆటగాళ్లు అఫ్గాన్‌ బోర్డు నిర్ణయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జట్టును నడిపించడం కొత్త కెప్టెన్‌కు పెను సవాలే.

జట్టు:

జట్టు:

గులాబదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), అస్ఘర్‌ అఫ్గాన్‌, హమిద్‌ హసన్‌, హజ్రతుల్లా, షెజాద్‌, నజీబుల్లా జద్రాన్‌, రెహమత్‌ షా, సమియుల్లా షెన్వారి, కరీమ్‌ జనాత్‌, అఫ్తాబ్‌ అలమ్‌, దవ్లాత్‌ జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, నబి, ముజీబ్‌, నూర్‌ అలీ జద్రాన్‌, రషీద్‌ ఖాన్‌, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, షిర్జాద్‌.

Fixtures:

June 1 v Australia (Bristol)

June 4 v Sri Lanka (Cardiff)

June 8 v New Zealand (Taunton)

June 15 v South Africa (Cardiff)

June 18 v England (Manchester)

June 22 v India (Southampton)

June 24 v Bangladesh (Southampton)

June 29 v Pakistan (Leeds)

July 4 v West Indies (Leeds)

Story first published: Thursday, May 16, 2019, 13:52 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+