Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాంటింగ్‌ చుట్టూ 'ఎనిమిదేళ్ల పిల్లల్లా' ఆసీస్ ఆటగాళ్లు

ICC Cricket World Cup 2019: Aaron Finch Trolls Teammates Behaviour In Ricky Pontings Presence

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చుట్టూ 'ఎనిమిదేళ్ల పిల్లల్లా' ఆసీస్ ఆటగాళ్లు తిరుగుతున్నారట. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు ఆసీస్ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌. గత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూడు నెలల కాలంలోనే పాంటింగ్‌ తనదైన ముద్ర వేసాడు. ఆసీస్ వరుస వైఫల్యాలు, జట్టు కూర్పును పాంటింగ్‌ గాడిలో పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఆసీస్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

ఆసీస్ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ మాట్లాడుతూ... 'డ్రెస్సింగ్‌ రూమ్‌లో పంటర్‌ (పాంటింగ్‌) ఉంటే మా ఆటగాళ్లు అందరూ అతడి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ చుట్టూ తిరిగే ఎనిమిదేళ్ల పిల్లల్లా మారిపోతాం. ఇది ఇబ్బందికరంగా ఉన్నా.. బాగుంటుంది. ప్రపంచకప్‌లో పాంటింగ్‌ సలహాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి' అని ఫించ్‌ తెలిపాడు.

రికీ పాంటింగ్‌ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు రెండు వరుస ప్రపంచకప్‌లు అందుకుంది. 2003, 2007 సంవత్సరాల్లో పాంటింగ్‌ జట్టును విజయవంతగా నడిపి కప్‌లను అందించాడు. ముఖ్యంగా 2003 ఫైనల్లో 150 పరుగులు చేసి ఆసీస్ జట్టుకు భారీ స్కోర్ అందించి తనదైన ముద్ర వేసాడు. 2003-07 మధ్య కాలంలో పాంటింగ్‌ తన సారథ్యంలో ఆసీస్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆ సమయంలో ఆసీస్ అన్ని జట్లపై తన ఆధిపత్యం కూడా చెలాయించింది.

మే 30 నుండి ఇంగ్లండ్‌ వేదికగా ఆరంభమయ్యే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగుతోంది. ఫేవరేట్ జట్లలో ఆసీస్ కూడా ఉంది. మరోవైపు పాంటింగ్‌ కూడా టైటిల్‌ నెగ్గేందుకు ఆటగాళ్లను సాన పడుతున్నాడు. ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఇక జూన్ 1న ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో ప్రపంచకప్‌ వేట మొదలుపెట్టనుంది.

Story first published: Tuesday, May 21, 2019, 11:57 [IST]
Other articles published on May 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+