Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే ఆ 3 రికార్డులివే!

ICC Cricket World Cup 2019 : 3 Records Rohit Sharma Can Break In World Cup 2019 || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: 3 records Rohit Sharma can break in this tournament

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ని మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 320 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక, టోర్నీలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 30 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.

రోహిత్ శర్మ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే ఈ ప్రపంచకప్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏంటే ఒక్కసారి పరిశీలిద్దాం...

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇదే ఫామ్‌ని గనుక కొనసాగిస్తే ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ సాధించిన 673 పరుగుల రికార్డు ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ(320) పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడితే సచిన్ రికార్డుని బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు

ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు

సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంలో రోహిత్ శర్మ దిట్ట. మ్యాచ్ ఆరంభంలో నిలకడగా ఆడి ఆ తర్వాత క్రీజులోకి కుదురుకున్నాక భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్ధుడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడు. వన్డేల్లో శ్రీలంకపై రోహిత్ శర్మ నమోదు చేసిన 264 పరుగులు రికార్డు ఇప్పటికీ చెక్కుచదరలేదు. ప్రపంచకప్‌లో ఓ బ్యాట్స్ మన్ నమోదు చేసిన అత్యధిక స్కోరు 237. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ ఈ అత్యధిక స్కోరుని సాధించాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. రోహిత్ శర్మ దూకుడు చూస్తుంటే ఈ ప్రపంచకప్‌లో ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది.

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు బాదాడు. ఈ రికారు్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌‌లో రోహిత్ శర్మ ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. మరో రెండు సెంచరీలు బాదితే కుమార సంగక్కర రికార్డుని సమం చేస్తాడు.

Story first published: Thursday, June 27, 2019, 15:19 [IST]
Other articles published on Jun 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+