For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Cricket World Cup 2019: 10 జట్లు... ఒక డ్రీమ్... ఛేజ్ మొదలైంది

ICC Cricket World Cup 2019

హైదరాబాద్: అది 1999 యూరప్‌లో యూరో కరెన్సీ వచ్చింది. నైజీరియా మిలటరీ రూల్‌ని తొలగించింది. స్కాటిష్ పార్లమెంట్ అధికారికంగా ఓపెన్ అయింది. పనామానియన్ గవర్నమెంట్ నుంచి యునైటెడ్ స్టేడ్స్ పనామా కెనాల్ పూర్తి పాలనను స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో 1999లో ఇంగ్లాండ్ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత 20 ఏళ్లలో ప్రపంచం పూర్తిగా మారింది... ముఖ్యంగా టీ20ల రాకతో ప్రపంచ క్రికెట్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది. దీనికి తోడు డే/నైట్ మ్యాచ్‌లు, పింక్ బాల్ టెస్టు క్రికెట్, డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) ఇలా ఎన్నెన్నో. 24 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఏలిన సచిన్ టెండూల్కర్ నుంచి 'బెస్ట్ బ్యాట్స్‌మెన్' బిరుదుని విరాట్ కోహ్లీ లాగేసుకున్నాడు.

గత 40 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే

అయితే, వీటన్నింటిలో మారనిది మాత్రం వన్డే వరల్డ్‌కప్. 1975లో తొలిసారిగా ప్రారంభమైన ఈ వరల్డ్‌కప్ గత 40 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉంది. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ వన్డే వరల్డ్‌కప్‌ను క్రికెట్ ప్రేమికులు దీనిని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం జరిగే 12వ ఎడిషన్‌ వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఆతథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానం వేదిక కానుంది.

మొత్తం 46 రోజుల పాటు

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ఈ 12వ ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ ఆతిథ్యం

ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ ఆతిథ్యం

జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. 1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

రౌండ్ రాబిన్ పద్ధతిలో

రౌండ్ రాబిన్ పద్ధతిలో

1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, ఈ మెగా టోర్నీ పలువురు ఆటగాళ్లుకు ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది ఆఖరి వరల్డ్‌కప్ అని క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ఈ మెగా టోర్నీలో టీమిండియా సైతం టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉంది. భారత జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించగలిగే క్రికెటర్లు ఉన్నారు.

దోనికి ఇదే చివరి వరల్డ్‌కప్!

దోనికి ఇదే చివరి వరల్డ్‌కప్!

ముఖ్యంగా ధోని అనుభవం ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియాకు పెద్ద ప్లస్ అవనుంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది తొలి వరల్డ్‌కప్ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆస్ట్రేలియా విషయానికి వస్తే బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత నిషేధం ముగియడంతో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు జట్టులోకి రావడంతో ఆ జట్టు మరింత బలంగా తయారైంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది.

నిలకడగా రాణించిన జట్టుగా న్యూజిలాండ్

జట్టులో పెద్దగా స్టార్లు లేకపోయినప్పటికీ.. సమిష్టి కృషితో ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ల్లో అత్యంత నిలకడగా రాణించిన జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండే. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెమీపైనల్స్ అడిన జట్టుగా ఆస్ట్రేలియాతో కలిసి న్యూజిలాండ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

ఆస్ట్రేలియా ఏడు సార్లు సెమీపైనల్స్‌కు

ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఏడు సార్లు సెమీపైనల్స్‌కు అర్హత సాధించగా.... న్యూజిలాండ్ కూడా ఏడు సెమీఫైనల్స్‌ ఆడింది. 1992 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు సెమీపైనల్‌కు చేరినప్పటికీ కప్పు గెలవాలన్న దక్షిణాఫ్రికా జట్టు కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తిడికి గురవడమో లేక, దురదృష్టం తోడవడమో ఆ జట్టు ఓటమికి కారణమవుతున్నాయి.

వన్డే క్రికెట్‌కు దూకుడుని పరిచయం చేసిన శ్రీలంక

శ్రీలంక... ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన జట్టు. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన వన్డే క్రికెట్‌కు దూకుడుని పరిచయం చేశారు. ఓ అనామక జట్టుగా 1996 టోర్నీలో బరిలోకి దిగి అద్భుతం చేసింది. ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తలక్రిందులు చేసిన ప్రపంచ‌కప్ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత నుంచి లంకేయుల నుంచి ఆ స్థాయి మెరుపులు రాలేదు. 2007, 2011లో మాత్రం ఫైనల్‌దాకా చేరినప్పటికీ రన్నరప్‌గా నిలిచింది. ఇలా... 10 జట్లు ఈ మెగా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్ ఇంగ్లాండ్-దక్షిణాప్రికా జట్ల మధ్య జరగనుంది.

Story first published: Wednesday, May 29, 2019, 18:10 [IST]
Other articles published on May 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+