For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లెక్క సమం చేసేనా?: ఇంగ్లాండ్‌పై బంగ్లా మెరుగైన రికార్డు!

ICC Cricekt World Cup 2019: England will aim to get back on track against Bangladesh

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్ వేదికగా శనివారం ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. జో రూట్‌, జోస్ బట్లర్‌ సెంచరీలతో చెలరేగినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు మొదటి మ్యాచ్‌లో అదే సఫారీలను ఓడించిన బంగ్లా రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది. గత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయే ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈసారి లెక్కను సమం చేయాలని మోర్గాన్‌ సేన భావిస్తోంది. ముఖాముఖిగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 వన్డేలు జరగ్గా 16 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది.

నాలుగింటిలో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై బంగ్లా మెరుగైన రికార్డుని కలిగి ఉంది. మెగా టోర్నీలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లాడగా... రెండింటి (2011, 15)లో బంగ్లాదేశ్, ఒకదాంట్లో (2007) ఇంగ్లాండ్‌ గెలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగగా... బంగ్లాదేశ్ కూడా అన్ని పెద్ద జట్లకూ దీటుగా నిలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన పేసర్‌ ప్లంకెట్‌ తిరిగి ఇంగ్లాండ్‌ తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్‌ ఆసక్తి రేపుతోంది. కాగా, ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న కార్ఢిఫ్ వికెట్‌ కొంత నెమ్మదిగానూ ఉంటుంది.

అయితే, బౌండరీ పరిధి (ప్రత్యేకించి స్ట్రైట్‌ బౌండరీ) చిన్నది కావడంతో భారీ స్కోర్లకు అవకాశం లేకపోలేదు. ఈ వేదికలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 342 పరుగులు చేసింది. రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.

జట్ల వివరాలు:
ఇంగ్లాండ్
: ఇయాన్ మోర్గాన్ (సి), మోయిన్ ఆలీ, జోఫ్రా ఆర్చర్, జోనీ బెయిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ కుర్రాన్, లియం డావ్సన్, లియం ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

బంగ్లాదేశ్: మష్రఫ్ మోర్టజా (కెప్టెన్), అబు జయీద్, లిటోన్ దాస్ (వికెట్ కీపర్), మహ్ముదుల్లా, మెహీదీ హసన్, మొహమ్మద్ సైఫుద్దిన్, మొస్దాడ్క్ హుస్సేన్, ముష్కికర్ రహిమ్, ముస్తాఫిజూర్ రహ్మాన్, రుబెల్ హొస్సేన్, సబ్బీర్ రహ్మాన్, షాకిబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తైమ్ ఇక్బాల్.

మ్యాచ్ ప్రారంభం మద్యాహ్నాం 3 గంటలకు
స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం
లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్‌లో

Story first published: Saturday, June 8, 2019, 11:00 [IST]
Other articles published on Jun 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+