Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సులతోనే మోర్గాన్ సెంచరీ: ఇంగ్లాండ్-ఆప్ఘన్ మ్యాచ్‌లో బద్దలైన రికార్డులివే

ICC Cricekt World Cup 2019: England vs Afghanistan--Statistical Highlights

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఇంగ్లాండ్ మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో సమిష్టి ప్రదర్శన చేసింది. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. అనంతరం 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది.

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్స్‌ల రూపంలోనే 102 పరుగులు రాబట్టడం విశేషం. మరోవైపు ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (0/110) కూడా సెంచరీ సాధించాడు. అయితే, రషీద్ ఖాన్ సెంచరీ సాధించింది బ్యాటింగ్‌లో కాదు ధారాళంగా పరుగులు సమర్పించుకుని.

ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ తీయకుండా 110 పరుగులు సమర్చించుకున్నాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ 17 సిక్సర్లతో ప్రపంచ రికార్డుని నెల‌కొల్పడంతో పాటు అనేక అంతర్జాతీయ రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో

ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో

1 - ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (16 సిక్సర్లు) రెండో స్థానానికి చేరాడు.

33 - ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు.

4 - ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీ (57 బంతుల్లో)ని మోర్గాన్ నమోదు చేశాడు. కెవిన్ ఓబ్రయన్ (50 బంతుల్లో) అగ్రస్థానంలో ఉండగా.. మ్యాక్స్‌వెల్ (51 బంతుల్లో), డివిలియర్స్ (52 బంతుల్లో) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఆరో స్థానంలో

అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఆరో స్థానంలో

6 - వన్డేల్లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్ (211) ఆరో స్థానంలో నిలిచాడు. అఫ్రిది (పాకిస్థాన్-351), గేల్ (వెస్టిండీస్-318), జయసూర్య (శ్రీలంక-270), ధోనీ (225), రోహిత్ (224) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

7 - రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ బాదిన సిక్సర్ల సంఖ్య. వన్డేల్లో ఓ బ్యాట్స్‌మెన్‌కు ఓ బౌలర్ సమర్పించుకున్న అత్యధిక సిక్సులు ఇవే. గతంలో జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో డివిలియర్స్ రెండుసార్లు ఆరేసి సిక్సర్లు బాదాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

11 - వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) సమర్పించుకున్న బౌలర్‌గా రషీద్ ఖాన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

17 - ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ బాదిన సిక్సలు సంఖ్య. వన్డేల్లో ఇవే అత్యధికం. ఈ క్రమంలో రోహిత్ శర్మ (2013లో ఆస్ట్రేలియాపై), ఏబీ డివిలియర్స్ (2015లో వెస్టిండీస్‌పై), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై) పేరిట సంయుక్తంగా ఉన్న 16 సిక్సర్ల రికార్డు బద్దలైంది.

చెత్త గణాంకాలను నమోదు చేసిన రషీద్ ఖాన్

చెత్త గణాంకాలను నమోదు చేసిన రషీద్ ఖాన్

25 - ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కొట్టిన మొత్తం సిక్సర్లు. ఓ వన్డే మ్యాచ్‌లో ఇవే అత్యధికం.

0/110 - ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో నమోదు చేసిన చెత్తగణాంకాలు. వరల్డ్‌కప్‌లో ఓ బౌలర్ చేసిన అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. గతంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టీన్ స్నెడెన్ (0/105; 1983 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 ఓవర్లలో) రికార్డుని రషీద్ ఖాన్ అధిగమించాడు.

397/6 - ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఈ టోర్నీలోనే బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన 386/6 పరుగుల స్కోరు రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు.

Story first published: Wednesday, June 19, 2019, 15:13 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+