కుల్దీప్ మాయ: మ్యాచ్‌ని మలుపు తిప్పిన అద్భుత బంతి అదే (వీడియో)

హైదరాబాద్: ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన హై ఓల్డేజ్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం లక్ష్య చేధనలో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు భారత్‌కు పోటీ ఇచ్చేలా కనిపించింది. గాయంతో పాక్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ నుంచి భువనేశ్వర్ బౌలింగ్ నుంచి తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేయడానికి విజయ్ శంకర్ వచ్చాడు. తన తొలి బంతికే ఓపెనర్ ఇమాముల్ హక్ (7)ను ఔట్ చేయడంతో పాక్ పతనం ప్రారంభమైంది.

క్రీజులో కుదురుకున్నాక
ఆ తర్వాత ఫకర్ జమాన్, బాబర్ అజామ్ (48) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. క్రీజులో కుదురుకున్నాక వీళ్లిద్దరూ దూకుడుగా ఆడటంతో 23 ఓవర్లకు 113/1తో పాక్ మంచి స్థితిలో నిలిచింది. ఈ సమయంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మామ చేశాడు. 24వ ఓవర్లో అద్భుతమైన బంతితో బాబర్ అజామ్‌ను బౌల్డ్ చేసి మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.
బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే
ఈ బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్‌స్టంప్ మీదుగా పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని లోపలికి దూసుకొచ్చింది. బయటి వైపు ఆడేందుకు ప్రయత్నించిన బాబర్ పూర్తిగా అంచనా తప్పా డు. దీంతో బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి దూసుకుపోయిన బంతి బెయిల్స్‌ను ఎగరగొట్టింది. అజామ్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.

మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు
ఆ తర్వాతి ఓవర్లో ఫకార్ జమాన్ కూడా ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. అనంతరం ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో సీనియర్ బ్యాట్స్‌మెన్ హఫీజ్ (9), షోయబ్ మాలిక్ (0)లను ఔట్ చేయడంతో పాక్ టాపార్డర్ కూప్పకూలింది. అనంతరం కెప్టెన్ సర్ఫ్‌రాజ్ (12) పోరాటం ఎంతోసేపు సాగలేదు.

వర్షంతో మ్యాచ్ గంట పైగా అంతరాయం
ఈ దశలో వర్షంతో మ్యాచ్ గంట పైగా అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications