లంక చేతిలో తొలి పరాభవం: ఓటమిపై కోహ్లీ ఏమన్నాడో తెలుసా?
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి పరాభవం ఎదురైంది. గురువారం ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
మ్యాచ్‌కి ముందు శ్రీలంకను తేలికగా తీసుకుని టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చెలరేగినా.. బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.

లంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలం
ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. మ్యాచ్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మా బౌలర్లను ఎంతగానో నమ్మాను. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు. బౌలర్లు ఎలాగైనా గెలిపిస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుంది. పాక్‌పై రాణించిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు' అని అన్నాడు.

నిరాశే ఎదురైందని చెప్పిన కోహ్లీ
'లంకేయులు బ్యాట్‌తో చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నాను. కుషాల్ మెండిస్ (89), ధనుష్క గుణతిలక (76)లు మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైంది' అని పేర్కొన్నాడు.

లంక జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్‌ను ఆడారు
లంకతో జరిగిన మ్యాచ్‌లో మా బౌలర్లు తమ ఆలోచనకు మరిత పదను పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. లంక జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్‌ను ఆడారని కోహ్లీ కొనియాడాడు. లంక చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే భారత్ సెమీస్‌కు
భారత్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications