ధోని స్ధానంలో పాండ్యా బ్యాటింగ్: కోహ్లీ ఏం చెప్పాడంటే!
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన విశ్వరూపం ప్రదర్శించాడు.
32 బంతుల్లో 53 పరుగులు చేసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యువీ వచ్చాక ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. ఓవైపు కోహ్లీ తడబడుతున్నా యువీ మాత్రం ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు.
తనదైన శైలిలో భారీ షాట్లు ఆడాడు. హసన్ అలీ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా చెలరేగాడు. యువరాజ్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి పెవిలియన్‌కు చేరాడు. యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత వాస్తవానికి కెప్టెన్ ధోని క్రీజులోకి రావాలి. కానీ, అనూహ్యంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు.

ధోని స్ధానంలో పాండ్యా బ్యాటింగ్‌కు దించడంపై
ధోని స్ధానంలో హార్ధిక్ పాండ్యాని బ్యాటింగ్‌కు దించడం వెనుక పెద్ద కారణమమేనీ లేదని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యువీ అవుటైన తర్వాత ధోనిని పంపాలా? లేక హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్‌కు పంపాలా అనే విషమయై జట్టు సభ్యులతో చర్చించామని అందరూ పాండ్యా పేరునే వెల్లడించడంతో అతడినే బ్యాటింగ్‌కు పంపడం జరిగిందని చెప్పాడు.

పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించిన కోహ్లీ
పాండ్యా క్రీజులోకి వచ్చిన తర్వాత ప్రతి బంతని స్ట్రయిక్ చేసిన విధానంపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో పాండ్యా తొలి మూడు బంతుల్లో మూడు సిక్సులతో బాది అద్భుత ప్రదర్శన చేశాడని కోహ్లీ కితాబిచ్చాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ కావడంతో నలుగురు సీమర్లతో బరిలోకి దిగామని కోహ్లీ చెప్పాడు.

వర్షం కారణంగా మ్యాచ్ 48 ఓవర్లకు కుదింపు
వర్షం కారణంగా టీమిండియా ఇన్నింగ్స్‌ను 48 ఓవర్లకు కుదించారు. పొదుపుగా బౌలింగ్ చేసిన ఆమిర్‌తో పాటు రియాజ్ కూడా కాలు పట్టేసి, మైదానాన్ని వీడటంతో చివరి ఓవర్ వేసేందుకు పేసరే కరవయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ప్రత్యామ్నాయం లేక ఇమాద్ వసీమ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో వేయించాడు.

పాండ్యా హ్యాట్రిక్ సిక్సులు
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పాండ్యా మొదటి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాదేశాడు. చివరి బంతికి కోహ్లీ ఫోర్ బాదడంతో మొత్తం ఈ ఓవర్లో 23 పరుగులొచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications