Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: 29న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన..!

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు నవంబర్ 29న సమావేశం కానుంది. నిజానికి ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. కానీ.. భారత్, పాకిస్థాన్ లో ఆడేందుకు నిరాకరిస్తున్న సంగతి తెసిలిందే. దీంతో షెడ్యూల్ ఆలస్యంగా ప్రకటిస్తున్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని కోరుతోంది.

ఇండియా ఆడే మ్యాచ్ లు భారత్ లో కాకుండా వేరే దేశంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. యూఏఈ, లేదా శ్రీలంక నిర్వహించాలని కోరుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మాత్రం హైబ్రిడ్ మోడ్ లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించేందుకు నిరాకరిస్తుంది. భారత్ పాక్ పర్యాటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై చర్చించేందుకు ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశం కానుందని ఐసీసీ అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

ICC Champions Trophy schedule to be announced on November 29

మరోవైపు డిసెంబర్ 1న బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి రెండు రోజుల ముందు కీలకమైన వర్చువల్ సమావేశం జరుగుతుంది. భారత ప్రభుత్వం పాకిస్థాన్ లో తమ జట్టు పర్యటించడానికి అనుమతి ఇవ్వలేదు.పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఒప్పుకోకుంటే.. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని భావిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి 70 మిలియన్ల USD హోస్టింగ్ ఫీజు కంటే ఎక్కువ ఆర్థిక ప్రోత్సాహకాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది భారత్ ఆసియా కప్ హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. అప్పుడు పాకిస్థాన్ తో పాటు శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించారు. పాకిస్థాన్ 1996 ప్రపంచ కప్‌కు సహ-హోస్ట్ చేసింది. ఆ తర్వాత ఎలాంటి ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించలేదు. 2009లో పాక్ లో శ్రీలంక టీమ్ బస్సుపై జరిగిన భయంకరమైన దాడి తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పాక్ లో దేశాలు పర్యటించలేదు. ఆ తర్వాతా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆ దేశంలో పర్యటించింది. పాక్ భారత్ లో చాలా సార్లు పర్యటించినప్పటికీ ఇండియా మాత్రం పాక్ లో ఒక్కసారి కూడా పర్యటించలేదు.

Story first published: Wednesday, November 27, 2024, 9:40 [IST]
Other articles published on Nov 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+