Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్స్ ట్రోఫీ: 'భారత్‌ను ఓడించే సత్తా పాక్‌కు ఉంది'

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్ జట్టుకు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా భావిస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 4వ తేదీన ఎడ్జిబాస్టన్‌లో జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పత్రిక డాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యూనిస్ ఖాన్ పాక్ జట్టు ప్రదర్శనపై విశ్వాసం వ్యక్తం చేశాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఉన్న మెరుగైన రికార్డును కొనసాగిస్తాం. గతంలో భారత్‌ను పలుసార్లు ఓడించాం. సర్ఫరాజ్ ఖాన్ నేతృత్వంలోని పాక్ మరోసారి భారత్‌ను ఓడిస్తుంది' అని అన్నాడు.

ICC Champions Trophy: Pakistan capable of beating India, says Younis Khan

'నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లాండ్‌లోని పిచ్‌లు చాలా బాగున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ తరహా పిచ్‌లపై ఎంతటి లక్ష్యమైనా సునాయాసంగా చేధించవచ్చు' అని యూనిస్ ఖాన్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 400 పరుగల లక్ష్యాన్ని కూడా సులభంగా చేధించొచ్చని తెలిపాడు.

వన్డే, టీ20ల్లో విజయాలు సాధించాలంటే ఫీల్డింగ్ చాలా కీలకమని చెప్పాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్‌లో ఫీల్డింగ్‌లో మెరుగ్గా ఉన్న జట్టునే విజయాలు వరిస్తాయని యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ అహ్మద్‌కు ఇదొక గొప్ప అవకాశమని చెప్పాడు.

ఛాంఫియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌పై పాక్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా... పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్ 2-1తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ క్రమంలో ధోని బాటలోనే కోహ్లీ కూడా టీమిండియాకు విజయాన్ని అందిస్తాడా? లేదా అనే విషయం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశం అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+