Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌తో ఫైనల్: ఎవరు గెలుస్తారో చెప్పేశారు! (వీడియో)

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై వేల కోట్లలో బెట్టింగ్ జరుగుతుంటే కామెంటేటర్లు మాత్రం టీమిండియానే విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. తమ అభిమాన జట్టు గెలవాలని ఇరు దేశాలకు చెందిన అభిమానులు ప్రార్థనలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్లో కామెంటేటర్లుగా వ్యవహరించిన పలువురు భారత్-పాక్ మ్యాచ్‌పై విజయం పట్ల తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియోలో పాక్ మాజీ కెప్టెన్ ర‌మీజ్ ర‌జా, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ స్మిత్ మాత్ర‌మే పాక్‌కు ఓటేయ‌గా.. షేన్ వార్న్‌, పాంటింగ్‌, ఇయాన్ బిష‌ప్‌లాంటి దిగ్గ‌జాలు మాత్రం భారత్‌వైపే ఉన్నారు. రోహిత్‌ శర్మ, కోహ్లీ, ధావన్‌ అద్భుత ప్రదర్శనతో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ICC Champions Trophy, IND Vs PAK: Commentators vote for india ahead of final against pakistan final

వీరిలో ఎక్కువ శాతం భారత జట్టే విజయం సాధిస్తోందన్నారు. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెకొంది. భారత్ విజయం ఖాయమని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో పాక్‌ను తక్కువ అంచనా వేయలేమని, ఆ జట్టు కూడా మంచి ప్రదర్శన చేస్తోందని, ఏది ఏమైనా భారత్ గెలుపు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కోహ్లీసేన పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. టోర్నీలో భాగంగా రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన జట్టే ఫైనల్లో ఆడుతుంది. ఇక రాయిస్ స్థానంలో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఇంతకీ ఏయే కామెంటేటర్ ఏ దేశానికి మద్దతిస్తున్నారో ఈ వీడియోలో చూడండి.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+