ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ మనదే: అంబాసిడర్‌గా భజ్జీ
హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకునే సత్తా టీమిండియాకు ఉందని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. జూన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి లండన్ ఆథిత్యమిస్తోంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.
కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి-2017కు ఐసీసీ బుధవారం 8 మంది సీనియర్ క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించింది. భారత్ నుంచి వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. భజ్జీతో పాటు షాహిద్ అఫ్రీది (పాకిస్థాన్), హబీబుల్ బాషర్ (బంగ్లాదేశ్), ఇయాన్ బెల్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ (న్యూజిలాండ్), మైక్ హస్సీ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)లు ఉన్నారు.
జూన్ 1 నుంచి 8 మధ్య ఇంగ్లాండ్, వేల్స్‌లో జరిగే టోర్నీకి ఈ ఎనిమిది మంది బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మాజీ క్రికెటర్లందరూ 1,774 అంతర్జాతీయ వన్డేలు ఆడి 51,906 పరుగులు, 48 సెంచరీలు చేశారు. ఇక బౌలింగ్‌లో 838 వికెట్లు తీసుకున్నారు. ఈ మాజీలంతా ఛాంపియన్స్ ట్రోఫి పట్ల ఆదరణ పెరిగేలా కృషి చేయనున్నారు.

ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ ఇలా
ఈ టోర్నమెంట్లో జరిగే 15 మ్యాచ్‌లకు కొత్త తరాన్ని క్రికెట్ వైపు ఆకర్షించేలా కృషి చేస్తారని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఈ దిగ్గజాలతో కొన్ని స్కూళ్లు సందర్శించి పిల్లలకు క్రికెట్ మెళుకువలు నేర్పుతామని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ జట్టులో సభ్యుడైన హర్భజన్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

అంబాసిడర్‌గా ఎంపికవ్వడం గర్వంగా ఉంది
డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం గర్వంగా ఉందని అన్నాడు. టోర్నమెంట్‌ను ప్రమోట్ చేయడంలో తన వంతు భాద్యతను నిర్వర్తిస్తానని హర్భజన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీని కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీమిండియా అత్యుత్తమంగా ఆడాల్సి ఉంది
ఈ టోర్నీలో భారత్ తన అత్యుత్తమ ఆటను ఆడితే చాలని, అయితే ఈ టోర్నీలో ప్రపంచంలోని టాప్-8 జట్టు పోటీపడతాయని మరిచిపోకూడదని హర్భజన్ అన్నాడు. ప్రతి జట్టు తనకు మెరుగైన అవకాశముందనే అనుకుంటుందిని అన్నాడు. మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడతారన్నది ముఖ్యమని భజ్జీ చెప్పుకొచ్చాడు.

టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తా భారత్‌కు ఉంది
ఈ టోర్నీలో గెలిచే జట్టుగా ఏదైనా ఒక పేరే చెప్పమంటే మాత్రం సంతోషంగా భారత్ అంటానని అన్నాడు. ఈ జట్టుకు 2013లో గెలిచిన టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తా ఉందని బలంగా నమ్ముతున్నా, టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న ఇంగ్లాండ్ పరిస్థితులకు భారత్ ఎంత త్వరగా అలవాటు పడుతుందన్నది ఇక్కడ కీలకమని హర్భజన్ సింగ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications