Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో నిరూపితమైంది: బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసల వర్షం

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్‌ని కచ్చితంగా కోరుకుంటుందని మ్యాచ్ అనంతరం మోర్గాన్ అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ విషయం ఐపీఎల్ వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ తెలిపాడు. 'బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ల్లో స్టోక్స్‌ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. శనివారం నాటి మ్యాచ్‌లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్ లో కూడా మెరిశాడు. బ్యాటింగ్‌లో సెంచరీతో అదరగొట్టాడు' అని మోర్గాన్ ప్రశంసించాడు.

 ICC Champions Trophy: Every team would want exceptional Ben Stokes, says Eoin Morgan

మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టమని, అతడు ఏదో ఒక రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడని అతడి లాంటి క్రికెటర్‌ని ఏ జట్టు అయినా కోరుకుంటుందని మోర్గాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడని కితాబిచ్చాడు.

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ (109 బంతుల్లో 102 నాటౌట్‌) పరుగులతో అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+