Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ చేతిలో ఓటమి: నేటి మ్యాచ్‌తో పాక్ ఆటగాళ్లు బ్యాగ్‌లు సర్దుకుంటారా?

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా జూన్ 4(ఆదివారం) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలన్న చూస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్ వన్డేల్లో నెంబర్ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే పాకిస్థాన్‌కు సెమీస్ బెర్తు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైతే పాక్ తట్టా బుట్టూ సర్దుకుని ఇంటిబాట పట్టాల్సిందే. అయితే టోర్నీలో భాగంగా భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలవడం ఆ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసింది.

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌‌లో నిలకడగా రాణిస్తూ పటిష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో సఫారీలపై పాక్ గెలవడం అంటే కష్టమే. టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సమిష్టి ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా సెంచరీతో చెలరేగగా, బౌలర్లు రబడ, ఇమ్రాన్ తాహిర్ మెరడంతో లంకపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

అదే ఊపుతో పాకిస్థాన్‌పై విజయం సాధించాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాజిటివ్ మైండ్ సెట్‌తో మంచిది. ఓపెనర్లతో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లు స్ట్రయిక్‌ని రొటేట్ చేసుకుంటే నెమ్మదిగా ఆడితే సఫారీలకు కొంత మేరకు గట్టి పోటీ ఇవ్వగలదు.

అలా కాకుండా టీమిండియాతో ఆడిన మాదిరే ఆడితే ఈ మ్యాచ్‌లో కూడా ఓటమిపాలవ్వాల్సిందే. అంతేకాదు పాకిస్ధాన్‌ను ఆటగాళ్ల గాయాలు కూడా వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టుకు చెందిన పేసర్ వాహబ్ రియాజ్ గాయం కారణంగా టోర్నీకే దూరమయ్యాడు. వాహబ్‌ రియాజ్‌ స్థానంలో యువబౌలర్‌ రుమన్‌ రాయిస్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ ప్రకటించింది.

టోర్నీకి దూరమైన పేసర్ రియాజ్‌

దీంతో రియాజ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. రియాజ్‌ స్థానాన్ని ఏ బౌలర్‌తో భర్తీ చేయాలని తీవ్రంగా ఆలోచించిన పీసీబీ చివరకు రుమన్‌ రాయిస్‌ను ఎంచుకుంది. ఈ యువ బౌలర్‌కు ఇప్పటివరకు ఒక్క టీ20 మాత్రమే ఆడిన అనుభవం ఉంది. తనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్నందుకు ఈ సందర్భంగా రాయిస్‌ ధన్యవాదాలు తెలిపాడు.

ఒత్తిడికి గురికాకుండా మంచి ప్రదర్శన చేయాలి

ఒత్తిడికి గురికాకుండా మంచి ప్రదర్శన చేయాలి

టాప్‌ బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీయడమే తన ముందున్న లక్ష్యమని రాయిస్ తెలిపాడు. అయితే వెస్టిండీస్‌తో ఒక్క టీ20మ్యాచ్‌ మాత్రమే ఆడిన అనుభవం ఉన్న రాయిస్, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మంచి ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోడానికి తనకి దక్కిన అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకుంటానని తెలిపాడు.

సరైన ప్రణాళికలను అమలు చేయాలి

ప్రస్తుతం ఒక్క బౌలింగ్‌తోనే నెట్టుకొస్తున్న పాకిస్థాన్ జట్టుకు సఫారీలపై గెలవాలంటే సరైన ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తుది జట్టులో వాహబ్ రియాజ్ స్ధానంలో జునైద్ ఖాన్ చోటు దక్కించుకుంటే ఆ జట్టులే లాభం. గతంలో జునైద్ ఖాన్ కొత్త బంతితో సత్తా చాటాడు కాబట్టి.

భారీ స్కోరు చేస్తేనే

భారీ స్కోరు చేస్తేనే

ఇక పాక్ ఓపెనర్లు సైతం నెమ్మదిగా ఆడుతూ భారీ స్కోర్లు చేయగలితే కొంత మేరకు దక్షిణాఫ్రికాకు పోటీ ఇవ్వగలరు. అంతేకాదు 300కు పైచిలుకు పరుగులు చేస్తేనే డివిలియర్స్ సేనకు కొంత మేరకు టార్గెట్ నిర్ణయించిన వారవుతారు. అలా కాకుండా భారత్‌తో జరిగిన మ్యాచ్ లాగే ఓపెనర్లు విఫలమైతే కష్టమే.

ఫేవరేట్‌గా దక్షిణాఫ్రికా

ఫేవరేట్‌గా దక్షిణాఫ్రికా

పాక్‌తో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఎడ్జిబాస్టన్ పిచ్ భారీ పరుగులు నమోదయ్యే పిచ్. ఈ పిచ్‌ బ్యాట్స్ మెన్లకు స్వర్గధామం. ఛాంపియన్స్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరుగుందో చూద్దాం.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+