ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. రెట్టింపు ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నేడు(ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే ఐదుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్న నేపథ్యంలో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు స్పిన్నర్లతో..
తుది జట్టులో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అల్ రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లో బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉండడంతో వారిని తీసుకోవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లో కుల్దీప్, వరుణ్ చక్రవర్తిలో.. వన్డ్లే అనుభవం కారణంగా కుల్దీప్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీతో షమీ పేస్ దళానికి నాయకత్వం వహిస్తాడు. హర్షిత్ రాణా బదులుగా అర్షదీప్ సింగ్ ను తీసుకోవచ్చు. ఎందుకంటే అర్షదీప్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు టాప్ ఆర్డర్ వికెట్లను త్వరగా పడగొట్టే సత్తా ఉంది.

వికెట్ కీపర్ గా పంత్ కు బదులు కేఎల్ రాహుల్ కే మొదటి ప్రాధాన్యత. దీంతో టీమిండియా టాప్ -6లో రైట్ హ్యాండ్ బ్యాటర్స్ మాత్రమే ఉంటారు. దీంతో బంగ్లాదేశ్ స్పిన్నర్లకు కాస్త అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇక బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు ఫ్రంట్ లైన్ సీమర్స్ ను తీసుకోవచ్చు. వీరికి మెహిది హసన్ మిరాజ్, రషీద్ హోస్సెన్ స్పిన్ ద్వయం తోడుగా ఉండే అవకాశం ఉంది.
టీమిండియా జట్టు అంచనా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్ జట్టు అంచనా : తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్.