Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్స్ ట్రోఫీ: టికెట్ బ్యాలెట్ ఓపెన్, జూన్ 4న భారత్ Vs పాక్

దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 కోసం టికెట్ బ్యాలెట్‌ను భారత కాలమానం ప్రకారం గురువారం (సెప్టెంబర్ 1) మధ్యాహ్నాం 2.30 గంటల తర్వాత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీమెంట్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆతిథ్యమిస్తున్నాయి.

టోర్నీలో భాగంగా మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. చిన్నపిల్లలకు £5, పెద్దవారికి £20 పౌండ్లుగా టికెట్ ధరలను నిర్ణయించారు. ఈరోజు నుంచి 30 రోజుల పాటు టికెట్ బ్యాలెట్ అందుబాటులో ఉంటుందని ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ www.icc-cricket.com/tickets ద్వారా క్రికెట్ అభిమానులు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ICC Champions Trophy 2017 ticket ballot opens; India-Pakistan match on June 4

ఈ టికెట్ బ్యాలెట్ భారత కాలమానం ప్రకారం 1, అక్టోబర్ 12.30 గంటలకు క్లోజ్ అవుతుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ టోర్నీపై మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్ ను ఓవల్ మైదానంలో బంగ్లాదేశ్ తో తలపడనుందని చెప్పారు.

ఇక ఐసీసీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డసన్ మాట్లాడుతూ వన్డేల్లో అత్యుత్తమ జట్టు ఏదనే తెలియజేసేందుకే ఈ ఛాంపియన్స్ ట్రోపీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంగ్లాండ్, వేల్స్ లోని మూడు వేదికల్లో టోర్నీ జరుగుతందని తెలిపారు. అభిమానులకు అందుబాటులోనే టికెట్ ధరలను ఉంచామని అన్నారు.

బ్యాలెట్ ద్వారా అమ్ముడుకాగా మిగిలిన టిక్కెట్లను అక్టోబర్ చివరి నాటికి జనరల్ సేల్లో అమ్మనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఆన్ లైన్‌లో బ్యాలెట్ ద్వారా 15 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఒక్కో దరఖాస్తుదారునికి కేవలం 10 టిక్కెట్లు మాత్రమే లభిస్తాయని తెలిపారు.

ICC Champions Trophy 2017 ticket ballot opens; India-Pakistan match on June 4

వన్డే క్రికెట్‌లో సెప్టెంబర్ 30 నాటికి టాప్ 8లో ఉన్న 8 జట్లు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొంటాయని తెలిపారు. జూన్ 1 నుంచి 18 వరకు జరగనున్న టోర్నీలో తొలి మ్యాచ్‌కు ఓవల్ మైదానం ఆతిథ్యమిస్తోంది. కార్ఢిప్ వేల్స్ మైదానంలో నాలుగు మ్యాచ్ లు జరగనుండగా అందులో జూన్ 14న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది.

ఎడ్జిబాస్టన్‌ మైదానం ఆతిథ్యమిచ్చే నాలుగు మ్యాచ్‌ల్లో రెండో సెమీ ఫైనల్‌తో పాటు ఇండియా V పాకిస్థాన్, అదే విధంగా, ఇంగ్లాండ్ V ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+