Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీలకు షాక్: పాక్‌ను గెలిపించిన వరుణుడు, సెమీస్ ఆశలు సజీవం

హైదరాబాద్: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చెలరేగింది. మరోవైపు వరుణుడు కూడా పాకిస్థాన్ విజయం సాధించడంలో సాయపడ్డాడు. టోర్నీలో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికా-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి వ‌రుణుడు అడ్డంకిగా మారాడు.

మ్యాచ్ ఫ‌లితం తేల‌కుండా అడ్డు త‌గిలాడు. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో పాక్‌ను విజేత‌గా అంపైర్లు ప్ర‌క‌టించారు. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌కు తొలి విజ‌యం ల‌భించింది. భారత్‌పై పేలవ ప్రదర్శన చేసిన బౌలర్లు.. బుధవారం సత్తా చాటి దక్షిణాఫ్రికాను 219/8కు కట్టడి చేశారు.

 South Africa have won the toss, elect to bat against Pakistan

ఆ తర్వాత వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి పాకిస్థాన్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో బాబర్‌ ఆజమ్‌ (31), షోయబ్‌ మాలిక్‌ (16) ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధన ప్రకారం పాక్‌ స్కోరు 27 ఓవర్లలో 100 పరుగులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పాక్‌ 19 పరుగులు అధికంగా చేసింది.

దీంతో 19 ప‌రుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం) తేడాతో పాకిస్థాన్ విజేత‌గా నిలిచింది. పాక్ ఓపెనర్లు అజహర్‌ అలీ (9), జమాన్‌ (31)లతో పాటు మహ్మద్‌ హఫీజ్‌ (26) కూడా అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన పాక్‌కు శుభారంభం అందించిన ఓపెనర్లను ఒకే ఓవర్లో మోర్కెల్‌ పెవిలియన్‌‌కు చేర్చాడు. ఆ తర్వాత అజామ్‌తో మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన హఫీజ్‌ను కూడా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మోర్ని మోర్కెలే మూడు వికెట్లు తీశాడు.

పాక్ విజయ లక్ష్యం 220

అంతకముదు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్ల సత్తా చాటారు. కట్టుదిట్టమైన బంతులతో పాక్ బౌలర్లు దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్‌‌ను కుప్పకూల్చారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

దీంతో పాకిస్థాన్ విజయ లక్ష్యం 220 పరుగులుగా నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డేవిడ్‌ మిల్లర్‌ (75; 1ఫోర్‌, 3 సిక్పర్లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఒంటిరి పోరాటం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ ఆమ్లా(16) పరుగుల వద్ద అవుట్ కావడంతో సఫారీల వికెట్ల పతనం ప్రారంభమైంది.

Miller

ఇమాద్‌ వసీమ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి హషీమ్‌ ఆమ్లా (16; 20 బంతుల్లో 2 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే వరుసగా డికాక్‌(33), కెప్టెన్‌ డివిలియర్స్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగడంతో ఆ జట్టు 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత డుప్లెసిస్ (26), డుమినీ(8), పార్నెల్‌ కూడా డకౌట్ కావడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులో వచ్చిన డేవిడ్ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌తో ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే క్రిస్ మోరిస్ (28) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

ఇదే సమయంలో డేవిడ్ మిల్లర్‌ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రబడతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే రబడ(26) పరుగుల వద్ద జునైద్‌ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేర్చాడు. పాకిస్థాన్ బౌలర్లలో హసన్‌ అలీ మూడు వికెట్లు తీయగా, ఇమాద్‌ వసీం రెండు, జునైద్‌ ఖాన్‌ రెండు, హఫీజ్‌ ఒక వికెట్ తీశారు.

అంతర్జాతీయ వన్డేల్లో డివిలియర్స్‌ గోల్డెన్ డకౌట్‌

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. ఎన్నో అంచనాలతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలను పాక్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో పరుగులు సాధించకుండా అడ్డుకున్నారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో పేసర్లు, స్పిన్నర్లు ఆకట్టుకున్నారు.

15 ఓవర్లలో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్ (33), హషీమ్ ఆమ్లా (16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 40 పరుగుల వద్ద ఆమ్లాను ఇమాద్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో స్కోరు బోర్డు మందగించింది.

South Africa have won the toss, elect to bat against Pakistan

ఆ తర్వాత కెప్టెన్ ఏబీ డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ చివరి బంతికి 60 పరుగులు వద్ద డికాక్‌ (33; 49 బంతుల్లో 2×4)ను మహ్మద్ హఫీజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇమాద్ వసీం వైడ్‌గా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ డివిలియర్స్ (0) థర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో జట్టు స్కోరు 61 వద్ద ఇమాద్‌ బౌలింగ్‌లో డివిలియర్స్ పెవిలియన్‌కు చేరాడు. అంతర్జాతీయ వన్డేల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌కి ఇదే తొలి గోల్డెన్‌ డకౌట్‌ కావడం గమనార్హం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్థాన్ జట్టు వన్డేల్లో నెంబర్ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి మంచి ఊపు మీదంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

South Africa have won the toss, elect to bat against Pakistan

మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గితే పాకిస్థాన్‌కు సెమీస్ బెర్తు అవకాశాలు ఉంటాయి. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలన్న చూస్తోంది.

దీంతో ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలన్న పాకిస్థాన్ చూస్తోంది. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌‌లో నిలకడగా రాణిస్తూ పటిష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో సఫారీలపై పాక్ గెలవడం అంటే కష్టమేనని అంటున్నారు.

జట్ల వివరాలు:
పాకిస్థాన్:
Azhar Ali, F Zaman, B Azam, M Hafeez, S Malik, S Ahmed, I Wasim, M Amir, S Khan, H Ali, J Khan

దక్షిణాఫ్రికా:
Q de Kock, H Amla, F du Plessis, AB de Villiers, D Miller, JP Duminy, C Morris, W Parnell, K Rabada, M Morkel, I Tahir

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+