‘కీప్ కామ్-ప్రిన్స్ ఈజ్ బ్యాక్’: జట్టుతో చేరిన యువరాజ్
లండన్: అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కి దూరమైన సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ మళ్లీ జట్టులో చేరాడు. మొదట అనుమానంగా ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కి యువరాజ్ సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో యువీ ఆడనున్నట్లు తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడేందుకు గతవారమే భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో యువరాజ్ ఇక్కడికి రాగానే జ్వరంతో బాధపడ్డాడు. దీంతో మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే యువరాజ్ కోలుకుంటాడని మేనేజ్‌మెంట్ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో యువరాజ్ పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించిన బీసీసీఐ 'కీప్ కామ్.. ప్రిన్స్ ఈజ్ బ్యాక్' అన్న క్యాప్షన్‌తో యువీ ఫొటోను జత చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ భారత జట్టులో చేరడంతో అదనపు బలం చేకూరినట్లయింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications