ధోని ఎదుర్కొన్న కఠినమైన ఫాస్ట్ బౌలర్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా లండన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ అండ్ కేర్ అనే ఆర్గనైజేషన్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ లండన్‌లో 'ఛారిటీ బాల్' అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ ఛారిటీ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కెప్టెన్ కోహ్లీతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ధోని, టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా హాజరయ్యారు.
కోహ్లీ విరాళాల సేకరణ కార్యక్రమానికి
చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అద్భుత విజయం సాధించిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ వ్యాఖ్యాతగా అలన్ విల్‌కిన్స్ ఆటగాళ్లను ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ధోనికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

తాను ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తరే
అయితే తాను ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ అని ధోని చెప్పాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది బౌలర్లను అతడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో అభిమానులను అలరించాడు. ఫాస్ట్ బౌలర్లందరినీ ఎదుర్కోవడం కష్టమేనని, అయితే అందులో ఒకరి పేరు చెప్పాలంటే పాక్ పేసర్ షోయబ్ అక్తర్ అని చెప్పాడు.

యార్కర్, బౌన్సర్ ఏది వేస్తాడో చెప్పలేం
అందుకు ధోని కారణం కూడా చెప్పాడు. అతను చాలా వేగంగా బంతి విసరుతాడని, దీంతో పాటు యార్కర్, బౌన్సర్ ఏది వేస్తాడో చెప్పలేమని అన్నాడు. అయితే బంతిని శరీరం పైకి కూడా విసురుతాడని మీరు ఊహించలేరని నవ్వుతూ చెప్పాడు. అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా ఫన్‌గా ఉంటుందని ధోనీ అన్నాడు.
డక్‌వర్త్ లూయిస్‌పై ధోని ఇలా
ధోనీ 2006లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అక్తర్ బౌలింగ్‌లో ధోనీ వరుసగా ఫోర్లు బాదాడు. దీంతో అక్తర్ బంతిని నేరుగా ధోనీ శరీరం పైకి విసిరాడు. ఈ మ్యాచ్‌లో ధోని 148 పరుగులు చేశాడు. మరోవైపు డక్‌వర్త్ లూయిస్‌పై అడిగిన ప్రశ్నకు ధోని తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications